- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కాన్ చేస్తే టీ, బటన్ నొక్కితే బిల్ ప్రింట్.. క్రియేటివ్ బైక్‌ను మీరు కూడా చూసేయండి!
అబ్బాయిలు బైక్‌లను తెగ ఇష్టపడుతుంటారు. అంతేకాదు, తమ బైక్ అందరిలో ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్: అబ్బాయిలు బైక్‌లను తెగ ఇష్టపడుతుంటారు. అంతేకాదు, తమ బైక్ అందరిలో ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు. ఇక తమ కలల బైక్‌ను కొని, దాన్ని తమకు నచ్చినట్లుగా ఆకర్షణీయంగా కస్టమైజ్ చేయించుకుంటారు. ఇటీవల ఇలా కస్టమైజేషన్ బైకులు తెగ ట్రెండ్ అవుతున్నాయి. కొంత మంది అయితే వింత వింతగా బైక్‌లను డిజైన్ చేయించుకుంటూ సోషల్ మీడియాలో (Social media) ఫేమస్ అవుతున్నారు. అయితే ఇటీవల ఎంసీఎం సంజయ్ (MCM Sanjay) అనే యూట్యూబర్ (Youtuber) చేసిన క్రియేటివ్ మోడిఫికేషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సంజయ్ తన బైక్‌ను టీ అమ్మే యంత్రంగా మార్చేశాడు. ముందు భాగంలో హెడ్లైట్ స్థానంలో ఓ స్కానర్ ఉంచి, వెనుక భాగంలో టీ కప్ కోసం చిన్న బాక్స్ ఏర్పాటు చేశాడు. స్కానర్‌తో QR కోడ్ స్కాన్ చేస్తే చాయ్ బయటకి వస్తుంది. అంతటితో ఆగలేదు.. టీ ఇచ్చిన తర్వాత ఓ బటన్ నొక్కగానే చిన్న ప్రింటర్ ద్వారా బిల్ కూడా బయటకి వస్తుంది. ఇదంతా చూడ్డానికే గమ్మత్తుగా, ఆసక్తిగా కనిపిస్తోంది.
ఈ వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను అతను తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశాడు. 'viral bike new feature' పేరుతో షార్ట్ రూపంలో వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సంజయ్ సృజనాత్మకతను చూసి మెచ్చుకుంటున్నారు. 'ఇది కేవలం బైక్ కాదు, మొబైల్ టీ కియోస్క్!' అని కామెంట్లు పెడుతున్నారు.






