- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిస్ అంటే రొమాన్స్ మాత్రమే కాదు.. వైరల్ వీడియోలో షాకింగ్ వాస్తవాలు!
పారిస్ అంటే శతాబ్ధాలుగా రోమాంటిక్ నగరంగా పేరొందిందని మనందరికీ తెలుసు. అద్భుతమైన శిల్పకళ, రాళ్ల రోడ్లు, ఆకర్షణీయమైన కాఫీ హోటల్స్, అందమైన సీన్ నది (Seine River) వంటివాటితో కళాకారులు, రచయితలు, ప్రేమజంటలను తనవైపు ఆకట్టుకుంటోంది.

దిశ, వెబ్ డెస్క్: పారిస్ (Paris) అంటే శతాబ్ధాలుగా రోమాంటిక్ నగరంగా (Romantic city) పేరొందిందని మనందరికీ తెలుసు. అద్భుతమైన శిల్పకళ, రాళ్ల రోడ్లు, ఆకర్షణీయమైన కాఫీ హోటల్స్, అందమైన సీన్ నది (Seine River) వంటివాటితో కళాకారులు, రచయితలు, ప్రేమజంటలను తనవైపు ఆకట్టుకుంటోంది. ఐఫిల్ టవర్, నోట్ర్‌డామ్ క్యాథడ్రల్ లాంటి చిహ్నాత్మక గుర్తులు పారిస్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చాయి. 'సిటీ ఆఫ్ లవ్' అని పిలవబడే ఈ నగరం ఎంతోమంది ప్రేమికులకు డ్రీమ్ డెస్టినేషన్‌గా ఉంటుంది. అయితే, ఇదంతా నగరానికి ఒకవైపు మాత్రమే.. మరోవైపు పారిస్ వీధుల్లో చెత్త, మానవ విసర్జనతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతూ, రొమాన్స్‌కు భిన్నమైన వాస్తవాన్ని ఎదురుగా ఉంచుతోంది. ఇటీవల ఫిలిప్పీన్స్‌కు చెందిన ట్రావెల్ వ్లాగర్ (Travel Vlogger) గ్రేసీ పోస్ట్ చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఈ నగరం అస్సలు ప్రచారంలోకి రాని మరో కోణాన్ని ప్రపంచానికి చూపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో గ్రేసీ పారిస్ వీధుల్లో నడుస్తూ కొన్ని ప్రాంతాల్లో పడి ఉన్న చెత్త, మానవ విసర్జన, ముదురు వాసనలు వంటివాటిని చూపిస్తూ.. 'పారిస్ నిజంగా అద్భుతమైన నగరం. నేను మూడు సార్లు వచ్చాను, ప్రతి సారీ ఈ నగరంతో ప్రేమలో పడ్డాను. కానీ చెప్పాలంటే, ఇక్కడ కొన్నిచోట్ల దుర్వాసన, వీధుల్లో అపరిశుభ్రత అసహనానికి గురిచేస్తాయి. అయినా తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. కానీ అంతగా రొమాంటిసైజ్ చేయకండి' అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోపై స్పందిస్తూ నెటిజన్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది దీనిని ద్వంద్వ దృష్టిగా భావించారు. 'భారతదేశం గురించి ఇలాంటి విషయాలు బయటపడితే అందరూ విమర్శిస్తారు, కానీ అదే పారిస్‌లో జరిగితే సమర్థిస్తారు', 'ప్రతి దేశానికీ మంచిదీ చెడ్డది ఉంటాయి. కానీ అవమానించేది మాత్రం భారత్‌నే' అంటూ కామెంట్లు పెడుతున్నారు.






