మరణం గెలవని మాతృప్రేమ..! ఊపిరి ఆగిపోయినా కొడుకును వదలని తల్లి

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-01 07:42:55  IST  )

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన పడవ ప్రమాదంలో ఓ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది.

మరణం గెలవని మాతృప్రేమ..! ఊపిరి ఆగిపోయినా కొడుకును వదలని తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ (Jabalpur)లో చోటుచేసుకున్న పడవ ప్రమాదం దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. నదిలో పడవ మునిగిపోతున్న సమయంలో ఓ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చేసిన పోరాటం అమ్మతనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. జబల్‌పూర్ సమీపంలోని బర్గి డ్యామ్‌ (Bargi Dam)లో ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందగా 15 మందిని సహాయక బృందాలు కాపాడాయి. తాజాగా మరో రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఈ క్రమంలోనే రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేపడుతుండగా.. నీటి అడుగున ఓ హృదయవిదారక దృశ్యం కనిపించింది. ఓ మహిళ మృతదేహం తన నాలుగేళ్ల బిడ్డను గట్టిగా హత్తుకుని ఉన్న స్థితిలో లభ్యమైంది. ఊపిరి ఆగిపోతున్న క్షణంలో కూడా తన కొడుకును వదలకుండా ప్రాణాలొదిలిన ఆ తల్లిని చూసి రెస్క్యూ సిబ్బంది, అధికారులను సైతం కన్నీరు పెట్టుకున్నారు.

Next Story