నన్ను పూర్తిగా స్కాన్ చేయు ప్లీజ్.. అంటూ మెట్రో స్టేషన్ బాత్రూమ్ లో ఆడామగ తేడాలేకుండా అడిగేసరికి...

by Dishafeatures3 |
నన్ను పూర్తిగా స్కాన్ చేయు ప్లీజ్.. అంటూ మెట్రో స్టేషన్ బాత్రూమ్ లో ఆడామగ తేడాలేకుండా అడిగేసరికి...
X

దిశ, ఫీచర్స్: వ్యాపారంలో రాణించేందుకు కొత్త కొత్త దారులు వెతుకుతుంటారు. తమ బిజినెస్ ను సరికొత్త మార్గంలో ప్రమోట్ చేయాలని అనుకుంటారు. ఇందుకు ఎంత తక్కువ మొత్తంలో ఖర్చు అయితే అంత మంచిది అనే ఆలోచన కూడా ఉంటుంది. ఇలాంటి థాట్ తోనే వ్యాపారం చేయాలనుకున్న ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. కాగా అడగకుండా గవర్నమెంట్ ప్రాపర్టీని వినియోగించడం ఇక్కడ మైనస్ అయింది.

గెరిల్లా మార్కెటింగ్ స్ట్రాటజీతో అరుణ్ అనే యువకుడు మెట్రో స్టేషన్ బాత్రూమ్ లో QR కోడ్ తో కూడిన స్టికర్స్ అంటించాడు. మీ ప్రియమైన వారికి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటే నన్ను పూర్తిగా స్కాన్ చెయ్ అనే ట్యాగ్ లైన్ వీటిపై యాడ్ చేశాడు. వీటిని స్కాన్ చేసి చాక్లెట్స్ కొనుక్కోవచ్చు అనేది ఈ వ్యాపారం అసలు కథ. కాగా ఎలాంటి పర్మిషన్ లేకుండా జరగడంతో... విషయం తెలిసిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అరుణ్ అరెస్టు కాక తప్పలేదు.

Next Story

Most Viewed