- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈవీఎంలో ఏకంగా కమలం గుర్తు గాయబ్.. ఫాల్టాలో రీపోలింగ్‌కు బీజేపీ డిమాండ్
పశ్చిమ బెంగాల్ రెండో అసెంబ్లీ ఎన్నికలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఫాల్టా నియోజకవర్గంలో కమలం గుర్తుపై తృణమూల్ నేతలు డబుల్ టేపులు అంటించారని బీజేపీ నేతలు రీపోలింగ్‌కు డిమండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ రణరంగంగా మారింది. డైమండ్ హార్బర్ లోక్‌సభ పరిధిలోని ఫాల్టా (Falta) నియోజకవర్గంలో ఈవీఎం (EVM)ల ట్యాంపరింగ్ జరిగిందని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఆరోపించడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (TMC) తరపున జహంగీర్ ఖాన్ బరిలో ఉన్నారు.
బటన్లపై డబుల్ టేపులు.. ఓటర్ల అభ్యంతరం
ఫాల్టా నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై బీజేపీ గుర్తు ఉన్న బటన్‌ను కనిపించకుండా డబుల్ టేపులు అంటించారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. ఓటర్లు కమలం గుర్తుకు ఓటు వేయకుండా అడ్డుకునేందుకే టీఎంసీ ‘డైమండ్ హార్బర్ మోడల్’ కుట్రకు పాల్పడిందని ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సీరియస్‌గా తీసుకుంది. పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి దీనిపై విచారణకు ఆదేశించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్ధారణ అయితే, ప్రభావిత బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫాల్టా నియోజకవర్గంలోని 144, 170, 189 బూత్‌లపై స్పెషల్ ఫోక్ పెట్టారు.






