- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ చాలా సురక్షితమైన ప్రాంతం.. ఇండియన్ ఆర్మీపై రష్యన్ ప్రశంసలు
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam terror attack) ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) చేపట్టి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్థాన్ భారత్‌పై డ్రోన్లతో దాడి చేయగా, భారత సైన్యం విజయవంతంగా వాటిని తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఓ రష్యన్ మహిళ (Russian women) భారత సైన్యాన్ని (Indian army) ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
పోలినా అగర్వాల్ అనే రష్యన్ మహిళ గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు. అయితే, భారత్, పాకిస్థాన్ ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులు గురించి విని తన అమ్మమ్మ తనను తిరిగి రష్యాకు వచ్చేయమన్నట్లు పోలినా తెలిపారు. అందుకు ఆమె ఏం చెప్పారో వీడియోలో వివరించారు. భారత్ అచ్చం తమ సొంతిల్లు మాదిరిగా సురక్షితమైందని చెప్పానని అన్నారు. అంతేకాదు, భారత సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని ఎంతగానో ప్రశంసించారు. భారత్ మిలటరీ వద్ద అధునాత ఆయుధాలు, వాయు రక్షణ వ్యవస్థలు, అన్ని రకలా డ్రోన్‌లు, విమానాలు ఉన్నాయని, భారత సైనికుల నిస్వార్థంగా తమ ప్రాణాలు పణంగా పట్టి ఆహర్నిశలు దేశాన్ని సంరక్షిస్తున్నారని, తామంతా ప్రశాంతంగా ఉన్నామని చెప్పినట్లు పేర్కొన్నారు. అందుకు తాను భారత సైన్యానికి ఎంతగానో కృతజ్ఞతతో ఉన్నానని చెప్పారు. అంతేకాదు ఈ వీడియోకి క్యాప్షన్ కూడా.. 'ఇక్కడ రాత్రిపూట మేమంతా హాయిగా నిద్రపోతున్నాం అంటే అందుకు కారణం భారత సైనికులనే వారికి సదా రుణపడి ఉంటాం' అని ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తూ షేర్లు చేస్తున్నారు.






