- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొలిసారి పబ్లిక్‌లోకి అగ్రహీరో.. దద్దరిల్లిన చెపాక్ మైదానం.. క్రేజ్ చూసి ఖంగుతిన్న క్రికెటర్లు
తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan)కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో.. తమిళ్‌లో తల అజిత్(Ajith)కు కూడా సేమ్ అదే రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందనడంలో సందేహం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan)కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో.. తమిళ్‌లో తల అజిత్(Ajith)కు కూడా సేమ్ అదే రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందనడంలో సందేహం లేదు. కేవలం తమిళ్‌లోనే కాకుండా ఆయనకు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ అభిమానులు ఉన్నారు. అయితే.. అజిత్ సినిమా షూటింగుల్లో తప్ప బయట ఎప్పుడూ కనిపించరు. సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లు, ప్రెస్‌మీట్‌లు అంటూ ఏమీ నిర్వహించరు. షూటింగ్ ముగిసిన వెంటనే కార్ రేసింగ్‌ల కోసం విదేశాలకు వెళ్తుంటారు.
అయితే తొలిసారిగా నిన్న అజిత్ పబ్లిక్‌లోకి వచ్చారు. పెళ్లిరోజు సందర్భంగా చెన్నైలోని చెపాక్ మైదానం(Chepauk Stadium) వేదికగా జరిగిన ఐపీఎల్(IPL) మ్యాచ్ చూసేందుకు ఫ్యామిలీతో సహా వచ్చారు. దీంతో అజిత్‌ను చూసేందుకు ఫ్యాన్స్ భారీ స్థాయిలో ఎగబడ్డారు. కెమెరామెన్ అజిత్ వైపు కెమెరా తిప్పగానే మైదానం మొత్తం హోరెత్తింది. ఒకానొక దశలో అజిత్ ఫాలోయింగ్ చూసి క్రికెటర్లు సైతం షాకయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం అజిత్ మ్యాచ్ వీక్షించిన ఫొటోలు, వీడియోలే వైరల్ అవుతున్నారు. అజిత్ ఫ్యామిలీతో పాటు మరో నటుడు శివకార్తికేయన్ కూడా ఫ్యామిలీతో మ్యాచ్‌కు వచ్చారు.
మరోవైపు.. ఎస్‌ఆర్‌హెచ్(SRH), చెన్నై(CSK) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెన్నైని 5 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (44), కమిందు మెండిస్ (32) రాణించడంతో సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ సీజన్లో వరుస ఓటములు మూటగట్టుకున్న సీఎస్కే.. ఇంకో ఓటమితో దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 9 మ్యాచ్‌ల్లో ఆ జట్టుకిది ఏడో పరాజయం. నిన్నటి విజయంతో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
Thala 🫶🏼🫶🏼🫶🏼#AK pic.twitter.com/MnocntSwk8
— AKARSH (@akarsh10_) April 25, 2025






