ఢిల్లీ బాగా డెవలప్ అయింది గురు! బికినీతో బస్సెక్కిన అమ్మాయి! వీడియో వైరల్

by Disha Web Desk 14 |
ఢిల్లీ బాగా డెవలప్ అయింది గురు!  బికినీతో బస్సెక్కిన అమ్మాయి! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బికినీలు ఎక్కువగా ఇతర దేశస్తులు ధరిస్తారనే విషయం తెలిసిందే. మరోవైపు భారత్‌లో సెలబ్రెటీలు, బీచ్‌లు, స్విమ్మింగ్‌ఫుల్‌ల్లో వద్ద కొంత మంది మహిళలు బికినీలు ధరిస్తారు. కానీ ఏ దేశంలోనైనా బికినీ అనేది ఎక్కువ శాతం బీచ్‌లు, స్విమ్మింగ్‌ఫుల్స్ వద్దే ధరిస్తారు. కానీ తాజాగా ఢిల్లీలో మాత్రం ఓ మహిళ ఏకంగా బికినీలో వచ్చి బస్సు ఎక్కింది. ఢిల్లీలోని ప్రజా రవాణా బస్సులోకి ఓ మహిళ బికినీలో వచ్చింది. దీంతో ఆమెను చూసి ఇతర ప్రయాణికులు అవాక్కయ్యారు. ఈమె ఎవరు ఇలా వచ్చిందేమిటి..? అని అనుకుంటూ అందరూ షాక్ అయ్యారు. దీంతో బస్సులో ఉన్న సదరు వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఇప్పటి వరకు ఢిల్లీ మెట్రో రైళ్లలో అసభ్య ప్రవర్తనలు చూశాం.. కానీ ఇప్పుడు బస్సుల్లో కూడా ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందని నెటిజన్లు ఫైర్ అయ్యారు. మరోవైపు కొంత మంది భారత్ చాలా డెవలప్ అవుతున్నదని సెటైర్లు వేశారు. అసలే రోజులు బాగాలేవు అంటే.. బస్సులో బికినీతో రావడం ఏమిటి? పిచ్చి పట్టిందా? అని నెటిజన్లు అభిప్రాయ పడ్డారు. అయితే బస్సులోకి బికినీతో రావడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. అయితే వీడియోలో ఆ మహిళను గమనిస్తే, అప్పుడే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టి వచ్చినట్లు ఉంది. జుట్టు, బికినీ కూడా తడిగా ఉన్నట్లు కన్పిస్తోంది.

Next Story