- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video : అలా చూస్తూ రోడ్డుపై నిలబడి ఉన్న ట్రాఫిక్ పోలీస్.. అంతలోనే ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
Viral video : అలా చూస్తూ రోడ్డుపై నిలబడి ఉన్న ట్రాఫిక్ పోలీస్.. అంతలోనే ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. మరికొన్ని ఫన్నీగా ఉంటూ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొన్ని ఏదో ఒక సందేశాన్నిస్తుంటాయి. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి సరదా సన్నివేశాలకు సంబంధించిన కంటెంట్ ఇటీవల తరచుగా వైరల్ అవుతూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తోంది. ఆ కోవకు చెందిననదే మరో వీడియో నెట్టింట చకర్లు కొడుతోంది. చూడ్డానికి సరదాగా అనిపించినప్పటికీ అందులో అంతర్లీనంగా గొప్ప మెసేజ్ కూడా ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం అది వచ్చీపోయే జనాలతో, వాహనాలతో రద్దీగా ఉండే ఒక సిటీలోని రోడ్డు మార్గం. వెహికల్స్ వస్తూ పోతూ ఉన్నాయి. అయితే రోడ్డు పక్కన ఒక ట్రాఫిక్ పోలీస్ నిలబడి ఉన్నాడు. అతను వేసుకున్న డ్రెస్‌పై ఉన్న అక్షరాలను గమనిస్తే అది చైనా దేశంలోని ఒక నగరమని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ అక్షరాలు చైనీస్ భాషలో ఉన్నాయి. ఇక అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు నిలబడి ఉన్న ఆ పోలీస్ తన చేతిలో చాక్లెటో, బిస్కెటో కానీ, పట్టుకొని ఉన్నాడు. కాగా అంతలోనే అతని వద్దకు ఒక పిల్లి వచ్చింది. అతని కాళ్లను, తన ముందు కాళ్లతో టచ్ చేస్తూ ఏదో కావాలని అడుగుతున్నట్లు బిహేవ్ చేసింది ఆ స్మాల్ క్యాట్. దీంతో ట్రాఫిక్ పోలీస్ దానివైపు చూడకుండానే తన చేతిలోని బిస్కెట్‌ను తుంచి ఆ పిల్లి నోటికి అందిస్తుంటే.. పిల్లి దానిని తినేస్తోంది. ఒక వైపు డ్యూటీపై ఫోకస్ చేస్తూనే, మరోవైపు తన వద్దకు వచ్చిన పిల్లికి బిస్కెట్ తినిపిస్తున్న ఆ ట్రాఫిక్ పోలీస్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకాలస్యం మీరూ ఓ లుక్కేయండి!






