- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video : ఓర్నీ.. ఇదేం విచిత్రం భయ్యా.. రిక్షాకు పెట్రోల్ కొట్టించుకోవడం ఎక్కడైనా చూశారా!
Viral video : ఓర్నీ.. ఇదేం విచిత్రం భయ్యా.. రిక్షాకు పెట్రోల్ కొట్టించుకోవడం ఎక్కడైనా చూశారా!

దిశ, ఫీచర్స్ : ఎక్కడికైనా పోవాలంటే బైకులో పెట్రోల్ పోయించుకుంటాం. లేదా కారులో డీజిల్ కొట్టించుకుంటాం. అంతేగానీ సైకిల్లోనో, రిక్షాలోనో ఎవరైనా పెట్రోల్ కొట్టించుకోవడం మీరెప్పుడైనా చూశారా..భయ్యా! విచిత్రం గాకుంటేనూ! కానీ ఒకాయన అట్లనే జేసిండు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇంతకీ అదెలా సాధ్యం, రిక్షాకు పెట్రోల్ కొట్టిండచమేంటి? అని డౌటా? అయితే ఇది చదవండి!
అది ఎక్కడో, ఏ ఊరో, ఏ పట్టణమో తెలియదు కానీ, వైరల్ వీడియోలో కనిపిస్తున్నదాని ప్రకారం అది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు. మామూలుగా అక్కడికి బైకులు, స్కూటీలు, కార్లు వంటి వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకోవడానికి జనాలు వస్తుంటారు. ఇది కామన్. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం రిక్షా తీసుకొని పెట్రోల్ పోయించుకోవడానికేమో అన్నట్లు సరా సరిన పెట్రోల్ బంకులోకి వస్తున్నాడు. అట్లెందుకొస్తున్నాడోనని ఆశ్చర్యంతో చూస్తుండగానే అతను రిక్షాలో పెట్రోల్ పోయించుకున్నాడు. ఈ సంఘటనను అక్కడే ఉండి గమనిస్తున్న ఒకతను వీడియో తీసి సోషల్ మీడియా(@ashu.vemulapalli)లో పోస్ట్ చేయగా, తెగ వైరల్ అవుతోంది.
రిక్షాలో పెట్రోల్ పోయించుకున్న సంఘటన గురించి ఆ వీడియో తీసిన వ్యక్తి దాని గురించి వివరిస్తూ ‘‘పెట్రోల్ బంకులో రిక్షాకేం పనబ్బా అని దగ్గరకెళ్లి చూస్తే దానికి ఆయిల్ కొడుతూ కనిపించింది. రిక్షాకు ఆయిల్ కొట్టడం ఏంటని చూస్తే దానికో మోటార్ బిగించి ఉంది. ఆ పెద్దాయనతో మాట్లాడితే పేదవాడి బతుకు చిత్రం కనిపించింది’’ అంటూ ఆసక్తికరంగా వివరించాడు. విషయం ఏంటంటే.. సదరు రిక్షాకు బైకు మోటర్ బిగించారు. కాబట్టి దానిని నడిపే వ్యక్తి పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చాడు. సాధారణంగా రిక్షాలను మనుషులే తొక్కుతారు కదా.. అందుకు భిన్నంగా ఇక్కడ మోటార్ బిగించిన రిక్షా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.






