‘కరోనాను ఓ అవకాశంగా భావించండి’

by  |
‘కరోనాను ఓ అవకాశంగా భావించండి’
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఓ అవకాశంగా భావించి, ఎలక్ట్రానిక్స్ తయారీరంగంలో రానున్న విజృంభణకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రపంచదేశాలు చైనాపై కోపంగా ఉన్నాయనీ, కావునా ఈ కోపాన్ని భారత తయారీ రంగానికి లాభసాటిగా మార్చుకోవాలని తెలిపారు. తయారీ రంగాలకు కేంద్రం ఇప్పటికే పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని, వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎలక్ట్రానిక్ తయారీ రంగాలు త్వరలోనే తెరుచుకునే అవకాశమున్నదని వెల్లడించారు. అలాగే, లాక్‌డౌన్ సమయంలో వివిధ రంగాలు చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఆరోగ్య సేతు యాప్ ఎంతో జనాధారణ పొందిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్య సేతు యాప్‌ను తయారు చేసిన విభాగాన్ని అభినందించారు. డిజిటల్ లావాదేవీలు చేపట్టినందుకు పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ను ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పోస్టల్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

tags: union it department, ravi shankar prasad, Treat Covid-19 as opportunity, electronics manufacturing,



Next Story

Most Viewed