టారిఫ్ ప్లాన్‌లతో సంబంధం లేకుండా పోర్టబులిటీ సదుపాయం ఇవ్వాలి: ట్రాయ్!

by  |
trai
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం కంపెనీలు తమ వినియోగదారులకు పోర్ట్ అయ్యేందుకు వీలుగా ఎస్ఎంఎస్ సదుపాయం కల్పించాలని ఆదేశించింది. ఇది వారి టారిఫ్ ఆఫర్, వోచర్, ప్లాన్‌లతో సంబంధం లేకుండా అవసరమైన మొబైల్ వినియోగదారులు అందరికీ అందేలా మొదలుపెట్టాలని స్పష్టం చేసింది. వినియోగదారులు తమ ప్రీపెయిడ్ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సదుపాయం పొందలేకపోతున్నట్టు చందాదారుల నుంచి ఫిర్యాదు అందాయని ట్రాయ్ వివరించింది.

‘తాజా ఆదేశాల ప్రకారం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ సబ్‌స్క్రైబర్లందరికీ పోర్ట్ అయ్యేందుకు వీలుగా తక్షణ సౌకర్యం అందుబాటులోకి రావాలని టెలికాం కంపెనీలకు తెలిపింది. టెలీకమ్యూనికేషన్ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ రెగ్యులేషన్స్-2009 ప్రకారం పోర్టింగ్ సౌకర్యం పొందేందుకు ప్రతి వినియోగదారుడికి అర్హత ఉంటుంది. టారిఫ్ ఆఫర్, వోచర్, ప్లాన్‌తో సంబంధం లేకుండా ఇది వర్తిస్తుందని ట్రాయ్ పేర్కొంది. కాగా, ఇటీవల వొడాఫోన్ ఐడియా తన టారిఫ్‌ ప్యాకేజీలోని ఎంట్రీ లెవల్‌ కస్టమర్లను తమకు నచ్చిన నెట్‌వర్క్‌కు పోర్ట్ అయ్యేందుకు వీలులేకుండా చేసిందని జియో ఆరోపించింది. దీనిపై ట్రాయ్‌కు ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే నియంత్రణ సంస్థ తాజా ఆదేశాలను జారీ కావడం గమనార్హం.



Next Story

Most Viewed