సింగరేణిలో అలజడి.. సీఅండ్ఎండీ‌కి చుక్కెదురు

by  |
సింగరేణిలో అలజడి.. సీఅండ్ఎండీ‌కి చుక్కెదురు
X

దిశ,గోదావరిఖని : తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి ఉన్న బొగ్గు గనులలో కార్మిక సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహించాల్సిన ఎన్నికలు గత కొన్ని సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి ముగిసిన ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించకపోవడంపై పలు జాతీయ కార్మిక సంఘాలు ఆందోళనలు చేయడంతో పాటు వరుసగా ఫిర్యాదు చేయడంతో, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సింగరేణి సీఅండ్ఎండీ‌కి చుక్కెదురైంది. ఇక మీదట అన్ని జాతీయ కార్మిక సంఘాలతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమానమే అని అధికారం లేదని అన్ని కార్మిక సంఘాలు సమానం అని లేఖ విడుదల చేయడంతో సింగరేణి వ్యాప్తంగా అలజడి నెలకొంది. 05 అక్టోబర్ 2017 న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలు పొందినట్లు మార్చి నెలలో అధికారిక ప్రకటన వెలుబడింది. అయితే ఈ ప్రకటనలో కేవలం రెండు సంవత్సరాల కాలపరిమితి తోనే గుర్తింపు సంఘం కాల పరిమితి ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.

దీంతో 2020లో నిర్వహించాల్సిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు కరోనా కారణంగా కోర్టు కేసులతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హేచ్ఎంఎస్ ఐదు జాతీయ కార్మిక సంఘాల నాయకులు హైదరాబాద్లోని సీఎల్‌సీ( సెంట్రల్ లేబర్ కమిషనర్)తో పాటు ఆర్ఎల్‌సీ ( రీజినల్ లేబర్ కమిషనర్)లకు ఫిర్యాదు చేసి వినతి పత్రాలను అందజేశారు. దీంతో కాలపరిమితి ముగిసిన గుర్తింపు సంఘంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కొనసాగుతుందని తెలపడంతో స్పందించిన రీజనల్ లేబర్ కమిషనర్ గుర్తింపు సంఘం‌తో పాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఇక మీదట సమానంగా పని చేయాలని సింగరేణిలో ఎటువంటి అధికారిక కార్యక్రమాలు అయినా ఐదు జాతీయ కార్మిక సంఘాల నాయకులను సమావేశాలకు పిలువాలని సింగరేణి సీఅండ్ఎండీ‌కి ఆదేశాలు జారీ అయ్యాయి. మళ్లీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని కార్మిక సంఘాలు ఒకటే అని లేఖలో పేర్కొన్నారు.

కోల్ ఇండియా మాదిరిగా అన్ని కార్మిక సంఘాలను సమానంగా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గత కొన్ని రోజులుగా జాతీయ కార్మిక సంఘాల నాయకులు తీసుకువస్తున్న ఒత్తిడితో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సింగరేణి వ్యాప్తంగా ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పవచ్చు. దాదాపు మూడు సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు సింగరేణిలో నిర్వహించకపోవడం పట్ల పలు కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోల్ ఇండియాలో కార్మిక సంఘాల సభ్యత్వం ఆధారంగా గుర్తింపు సంఘం అనుకుంటారు . ప్రస్తుత పరిస్థితులు సింగరేణి వ్యాప్తంగా అలాగే ఉన్నాయని పలువురు నాయకులు పేర్కొంటున్నారు .దీంతో రీజనల్ లేబర్ కమిషనర్ విడుదల చేసిన లేఖతో సింగరేణి వ్యాప్తంగా ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని వేచి చూడాల్సిందే..


Next Story

Most Viewed