రైతులను ఇబ్బందులకు గురిచేసే ఆంక్షలను ఎత్తివేయాలి: టీపీసీసీ సభ్యులు

by  |
రైతులను ఇబ్బందులకు గురిచేసే ఆంక్షలను ఎత్తివేయాలి: టీపీసీసీ సభ్యులు
X

దిశ, తొర్రూరు : రైతులను ఇబ్బందులకు గురి చేసే ధాన్యం కొనుగోళ్లపై పెట్టిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని టీపీసీసీ సభ్యులు ముత్తినేని సోమేశ్వర్ రావు, కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి లు అన్నారు. మంగళవారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మండల అధ్యక్షులు చెవిటి సుధాకర్ యాదవ్, తొర్రూరు పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ లతో కలసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడ్డ రైతు పంట పండించడానికి ఎంత కష్ట పడతాడో.. ఆ పంటను అమ్ముకోవడానికి అంత కంటే రెట్టింపు కష్ట పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రకరకాల పేర్లతో ధాన్యాన్ని కొనుగోలు చేయక గత నెల రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారుతుందని ధాన్యం కొనమని అధికారులు చెప్పడంతో కలత చెందుతున్న రైతులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నెత్తిపై మరిన్ని ఆంక్షలతో భారం మోపడం సరికాదన్నారు. ఆంక్షలు లేకుండా వెంటనే కాంటాలు జరిపి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అనుమాండ్ల నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ తొర్రూర్ మండల అధ్యక్షులు చిత్తలూరి శ్రీనివాస్, తొర్రూరు మాజీ సర్పంచ్ చాపల బాపురెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రదీప్ రెడ్డి, దేవేందర్ రాజు, తండా రవి, శ్రవణ్, బిక్షం గౌడ్, లింగన్న, వెంకన్న, సోమయ్య, పీ ప్రవీణ్ యాదవ్, వరప్రసాద్, రాంబాబు, నరేష్ నాయక్ భూతం భరత్, మధు, నరేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed