బాక్సింగ్‌ కా బచ్చన్.. ‘తుఫాన్’ రీఎంట్రీ అదిరేనా?

by Shyam |
Farhan-Aktar,-Toofan
X

దిశ, సినిమా: ఫర్హాన్ అక్తర్ ‘తుఫాన్’ ట్రైలర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత ఫర్హాన్ నుంచి వస్తోన్న మరో స్పోర్ట్స్ డ్రామా ఇదే కాగా.. లేటెస్ట్ ట్రైలర్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ‘సమాజంలో గౌరవంతో బతకాలనుకుంటే ‘గ్యాంగ్‌స్టర్ అజ్జు’గా కాకుండా ‘బాక్సర్ అజీజ్ అలీ’గా ఎదగాలన్న ప్రియురాలి సలహాతో రింగ్‌లోకి దిగుతాడు. ఈ క్రమంలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని ‘తుఫాన్’గా ఫేమ్ పొందిన అజీజ్.. ఎనిమిదేళ్లు ఎందుకు బ్యాన్ అవుతాడు? ఆ పీరియడ్ తర్వాత మళ్లీ రింగ్‌లోకి ఎంటర్ అయ్యేందుకు ఎందుకు సంకోచిస్తాడు? ఫైనల్‌గా బాక్సర్‌గా రీఎంట్రీ ఇస్తాడా? అభిమానుల అంచనాలు అందుకుని ‘తుఫాన్’గా కీర్తించబడతాడా లేదా?’ అనేది ట్రైలర్ ద్వారా చూపించారు మేకర్స్. పరేష్ రావల్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించిన సినిమాకు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకులు కాగా.. ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్స్, రాంప్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. శంకర్ ఎహసాన్ లాయ్ అండ్ టబ్బీ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 16న అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ కానుంది.



Next Story

Most Viewed