ఏపీలో ఆగమాగం.. 42 మంది మృతి

by  |
ఏపీలో ఆగమాగం.. 42 మంది మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. ఏరోజుకారోజు రికార్డులు సృష్టిస్తూ గత రికార్డులను తుడిపేస్తూ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఇంత వరకు నమోదైన అన్ని జిల్లా పాజిటివ్ కేసుల రికార్డులను బద్దలు కొట్టి 643 కరోనా పాజిటివ్ కేసులను నమోదు చేసింది. దీని బాటలోనే గుంటూరు (367), చిత్తూరు (328), కర్నూలు (315) పాజిటివ్ కేసుల నమోదులో దూసుకుపోతున్నాయి. దీంతో ఏపీలో గడచిన 24గంటల్లో 2,602 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇందులో 2,592 పాజిటివ్ కేసులు రాష్ట్రానికి సంబంధించినవి కాగా, ఇద్దరు విదేశీయులు, ఎమినది మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారివి కలుపుకుని 2,602 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 40,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో వివిధ ఆస్పత్రుల్లో 19,814 మంది కరోనాకి చికిత్స పొందుతున్నారు. మరో 20,298 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయి ఇళ్లకు చేరుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదే సమయంలో ఏపీలో 534 మంది కరోనా కారణంగా మృతి చెందితే.. కేవలం నిన్న ఒక్కరోజే అనంతపురం జిల్లాలో ఆరుగురు మరణిస్తే, చిత్తూరు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, విశాఖపట్టణం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు. దీంతో నిన్న ఒక్కరోజే 42 మంది మృత్యువాత పడ్డారు.


Next Story

Most Viewed