మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోరు : రేచల్

by  |
మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోరు : రేచల్
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్ : నేడు స‌మాజంలో మ‌హిళ‌లు పురుషుల‌తో స‌మానంగా అన్ని రంగాల‌లో రాణిస్తున్నార‌ని టీఎన్జీవో మ‌హిళా అధ్యక్షురాలు బీ రేచ‌ల్ అన్నారు.ఈ మేర‌కు శుక్రవారం ఉస్మానియా దంత క‌ళాశాల‌లో మ‌హిళా దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రేచ‌ల్ మాట్లాడుతూ.. ఒక‌ప్పుడు మ‌హిళ అంటే అబ‌ల అనే వార‌ని నేడు అలాంటి ప‌రిస్థితి మారి స‌బ‌ల అయ్యింద‌న్నారు. విద్య, వైద్యం, ఉద్యోగం, రాజ‌కీయం, వ్యవసాయం, టెక్నాల‌జీ ఇలా అన్ని రంగాల‌లో పురుషుల‌తో పోటీ ప‌డుతున్నార‌ని అన్నారు.

ఇలా అన్ని రంగాల‌లో మ‌హిళ‌లు ముందుకు వ‌స్తున్నప్పటికీ వారిపై ఇంకా హ‌త్యాచారాలు, గృహ హింస, దాడులు వంటివి చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇలాంటి వాటిని త‌రిమి కొట్టవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు.1975 సంవ‌త్సరం నుంచి మార్చి 8వ తేదీని ప్రపంచ మ‌హిళా దినోత్సవంగా ఐక్యరాజ్యస‌మితి అధికారికంగా నిర్వహిస్తోంద‌న్నారు. ఇందులో భాగంగా సోమ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళా దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శాంత‌కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed