టిక్ టాక్‌కు అండగా గూగుల్.. పెరిగిన రేటింగ్!

by  |
టిక్ టాక్‌కు అండగా గూగుల్.. పెరిగిన రేటింగ్!
X

ఏదైనా సమస్యను ముందు నుంచి తెగ్గొట్టడం వీలుకాకపోతే వెనక నుంచి తెగ్గొట్టుకుంటూ రావాలనే విధానాన్ని గూగుల్ పక్కాగా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్ వార్‌లో భాగంగా ‘బ్యాన్ టిక్ టాక్’ పేరుతో యూట్యూబ్ అభిమానులంతా గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్ టాక్‌కు రేటింగ్ తక్కువగా ఇస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల 2020 జనవరిలో 4.9గా ఉన్న టిక్ టాక్ రేటింగ్ 1.2కు పడిపోయింది. ఈ నేపథ్యంలో టిక్ టాక్‌ను సేవ్ చేయడానికి గూగుల్ రంగంలోకి దిగింది. అలాగని రేటింగ్ ఇచ్చే వాళ్లను ఎలాగూ కంట్రోల్ చేయలేదు కాబట్టి, ఇచ్చిన రేటింగులను డిలీట్ చేసి లెక్క సమం చేస్తోంది.

1.2 రేటింగ్ ఉన్నపుడు 28 మిలియన్ల రివ్యూలు ఉండేవి. కానీ రెండు మూడు రోజుల నుంచి టిక్‌టాక్ రేటింగ్ పెరుగుతోంది. ఇదెలా సాధ్యమని అనుమానం వచ్చి చెక్ చేస్తే, రివ్యూల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 1.5 రేటింగ్‌తో 23 మిలియన్ల రివ్యూలు మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపు 5 మిలియన్ల నెగెటివ్ రివ్యూలని గూగుల్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ ద్వేషం వల్ల వచ్చిన వన్ సైడెడ్ రివ్యూలు కాబట్టి గూగుల్ అలా చేసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే దీని గురించి గూగుల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరో వైపు ఆపిల్ స్టోర్‌లో టిక్‌టాక్ రేటింగ్ 4.8గానే కొనసాగుతుండటం గమనార్హం.



Next Story

Most Viewed