పశువుల మందపై పులి పంజా.. రక్షణ కల్పించాలంటున్న ప్రజలు

by  |
పశువుల మందపై పులి పంజా.. రక్షణ కల్పించాలంటున్న ప్రజలు
X

దిశ,బెజ్జుర్ : పశువుల మందపై పులి దాడి చేసిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని అందుగులగూడా గ్రామానికి చెందిన పశువులను పశువుల కాపరులు కుంటల మానేపల్లి అందుగులగూడా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి మేత కోసం తీసుకెళ్లగా పశువుల మంద పై అకస్మాత్తుగా పులి దాడి చేయడంతో పశువుల కాపరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఒక్కసారిగా పశువులు పరుగులు తీయడంతో చెల్లాచెదురుగా వెళ్లిపోయాయి. పులి దాడి చేయడంతో 3 పశువులకు తీవ్ర గాయాలైనట్లు పశువుల కాపరులు తెలిపారు. బెజ్జూర్ మండలం‌లోని పాపంపేట సమీపంలో పులి సంచరించడం‌తో ఆ ప్రాంత వాసులు ఆందోళనకు గురవుతున్నారు. అది మరువకముందే ఆదివారం మళ్లీ పులి పశువుల మందపై పంజా విసిరింది. దీంతో బెజ్జూర్ మండలం‌లో పులి కదలికలు ఉన్నాయని, మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి తిరుగుతున్న ప్పటికీ అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అటవీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పులి కదలికలపై నిఘా ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో పాటు పశువులకు రక్షణ కల్పించాల్సిందిగా బెజ్జూర్ మండల వాసులు కోరుతున్నారు.


Next Story

Most Viewed