త్రీ-వీలర్ అమ్మకాల్లో లేని రికవరీ సంకేతాలు

by  |
త్రీ-వీలర్ అమ్మకాల్లో లేని రికవరీ సంకేతాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా రిమోట్ వర్కింగ్ పెరిగిపోవడంతో దేశీయంగా త్రీ-వీలర్ వాహనాల అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో టూ-వీలర్ అమ్మకాలు ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య వార్షిక ప్రాతిపదికన 74 శాతం క్షీణించి 1,30,601 యూనిట్లుగా నమోదయ్యాయని పరిశ్రమల సంఘం సియామ్ గణాంకాలు తెలిపాయి. అయితే, వస్తువుల సరఫరా వాహనాల అమ్మకాలు ప్రయాణీకుల వాహనాల కంటే కొంచెం మెరుగ్గా ఉన్నాయి. అయితే, రోడ్లపై తక్కువ ట్రాఫిక్ ఉన్నందున త్రీ-వీలర్ మార్కెట్ రికవరీకి ఎక్కువ సమయం తీసుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజ్‌లు మూసేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నాయని త్రీ-వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ చెప్పారు.

దేశీయంగా నగరాలను బట్టి 30-70 శాతం మధ్య మాత్రమే డిమాండ్ కోలుకున్నట్టు రాకేశ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆటో-రిక్షా అమ్మకాల్లో 90-95 శాతం రుణాల ద్వారానే జరుగుతాయని, అలాంటి రుణాలు తగ్గిపోవడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్-నవంబర్ మధ్య ఫైనాన్షియర్ల నుంచి మెరుగైన మద్దతు ఉన్నప్పటికీ, అనంతర పరిణామాల్లో వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించారని దేశీయ రెండో అతిపెద్ద త్రీ-వీలర్ తయారీ సంస్థ పియాజియో మేనేజింగ్ డైరెక్టర్ డియెగో గ్రఫి వెల్లడించారు.

Next Story

Most Viewed