ట్రిపుల్ మర్డర్ కలకలం.. ఆ రాత్రి అసలేం జరిగింది ?

343

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :  జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న హార్వెస్టర్ రిపేరింగ్ సెంటర్లో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. మంచాలపై నిద్రిస్తున్న ముగ్గురిని గుర్తు తెలియని దుండగులు కత్తితో దారుణంగా పొడిచి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని డిచ్ పల్లి మండలం‌లోని 44 వ జాతీయ రహదారి‌ని ఆనుకొని ఉన్నా నాగపూర్ గేట్ వద్ద ఉన్న హార్వెస్టర్ షెడ్‌లో జరిగింది. మృతులు పంజాబ్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. వీరి వయసు ఇద్దరికి 40 ఏళ్లు ఉండగా, ఒకరికి 30 ఏళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాత్రి ఆరుబయట నిద్రిస్తున్నపుడు ఈ దారుణం జరిగి ఉంటుంది అని అనుమానిస్తున్నారు. ముగ్గురు హార్వెస్టర్ డ్రైవర్‌లుగా, మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. ఈ హత్య కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డిచ్ పల్లి పోలీస్‌లు క్లూజ్ టీం లు, డాగ్ స్క్వాడ్‌లతో నిందితుల కోసం గాలిస్తున్నారు. జిల్లాలో ట్రిపుల్ మర్డర్ ఘటన కలకలం రేపింది.