మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల ఫైన్

by  |
మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల ఫైన్
X

– మే 29 వరకు విమాన సర్వీసులు బంద్

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29 వరకు లాక్‌డౌన్ ప్రకటించడంతో అన్ని డొమెస్టిక్, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ఇంటి గడప దాటి బయటకు వచ్చే ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాల్సిందేనని లేదంటే మాస్కు లేకుండా పోలీసులు పట్టుకున్న ప్రతీసారి వెయ్యి రూపాయల జరిమానా తప్పదని స్పష్టం చేశారు. ప్రతీ ఉల్లంఘనకు ఈ స్థాయిలో జరిమానా తప్పదని ఆ ఉత్తర్వుల్లో తేల్చిచెప్పారు. ఇప్పటివరకు మాస్కు ధరించాలన్ని నిబంధన మాత్రమే అమలులో ఉన్నప్పటికీ ఇప్పుడు ధరించకపోతే జరిమానా వసూలు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజా సడలింపుల్లో ఇచ్చిన మార్గదర్శకాల్లో కొన్ని సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలన్నీ ఈ నెల 29వ తేదీ వరకు అమలులో ఉండనున్నాయి.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్ ఈ నెల 17 వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేసినట్లయితే వెంటనే విమానాల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ నెల 29 వరకు విమాన సర్వీసులపై నిషేధాజ్ఞలు విధించడంతో కేంద్రం సడలింపులు అమల్లోకి వచ్చే అవకాశం లేదు. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలోనూ ఈ నిబంధనలే అమలుకానున్నాయి. సడలింపుల నేపథ్యంలో పగటిపూట ఎలా ఉన్నా సాయంత్రం ఏడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు అత్యవసర పనులకు మినహా ఎవ్వరికీ రోడ్లపై తిరగడానికి అనుమతి లేదని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు సాధారణ పరిస్థితి ఉన్నప్పటికీ రెడ్ జోన్‌లో మాత్రం ఆంక్షలు ఉంటాయనిపేర్కొంది.

Tags: Telangana, Corona, LockDown, Restrictions, Relaxation, Mask, Fine, Flight services


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed