ప్రైవేట్ ​హాస్పిటల్స్​ బాధితుల సంఘం డిమాండ్ ఇదే!

84
Private Hospital

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్​ ఆస్పత్రుల్లో కరోనా పేరుతో రూ.లక్షల్లో దోపిడీ చేస్తున్నారని, జీఓ 248న అమలయ్యేలా చూడాలని తెలంగాణ ప్రైవేట్​హాస్పిటల్స్​ బాధితుల సంఘం కోరింది. ఈ మేరకు కింగ్​కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్​శ్రీనివాస్​ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించింది.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్స్​ లేవని ప్రజలు రోడ్లమీదనే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు, మెడిసిన్స్ కోసం కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. జీఓ248 అమలు చేయని ప్రైవేట్​ ఆస్పత్రులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీఓహెచ్ ను కోరారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..