'తల్లి చనిపోయిన బాధ.. ‘షిప్ మోడలింగ్’ లో ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది'

by  |
తల్లి చనిపోయిన బాధ.. ‘షిప్ మోడలింగ్’ లో ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది
X

దిశ, ఫీచర్స్: మధురైలోని అమెరికన్ కాలేజీలో చదువుతున్న క్వీంథంక్ అమలనాథన్‌కు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చేరే అవకాశం వచ్చింది. దీంతో ఎన్‌సీసీలో షిప్ మోడలింగ్‌ పోటీల్లో పార్టిసిపేట్ చేసి, ఎంతోమంది అభినందనలు అందుకున్నాడు. కానీ అనుకోని సంఘటన తన జీవితాన్ని మలుపుతిప్పంది. తను ఎంతో ప్రేమించే తల్లి చనిపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఆ బాధ నుంచి తనను తాను డైవర్ట్ చేసుకోవడానికి భిన్నమైన షిప్స్ రూపొందిచడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం దేశంలోని వివిధ మ్యూజియమ్స్‌లలో ఆ ఓడ నమూనాలను ఉండటం విశేషం.

కోయంబత్తూర్ నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న అమలనాథన్.. తొలిగా ‘షిప్ మోడలింగ్’ను తన అభిరుచిగా మాత్రమే పరిగణించాడు. కానీ కాలక్రమంలో దాన్నే లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకున్నాడు. అతడు రూపొందించిన పడవ బొమ్మలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. ఆర్డర్స్ రావడం ప్రారంభమైంది. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య మోడల్ షిప్‌ను నాలుగు అడుగుల పొడవుతో నిర్మించాలని తొలిగా ఏరో స్పోర్ట్స్ కంపెనీ నుంచి మొదటి ఆర్డర్ వచ్చింది. దాన్ని ఓ సవాలుగా తీసుకుని, రూపొందించి అభినందనలు అందుకున్నాడు. దాంతో మరిన్ని ఆర్డర్లు పెరిగాయి.

‘షిప్ మోడలింగ్ అనేది సాంప్రదాయక కళ. పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన గ్రీక్, ఈజిప్టు నాగరికతల నుంచి ఓడ నమూనాలను కనుగొన్నారు. ఇవి సముద్రయానం ప్రాముఖ్యతను నిర్ధారించడానికి సహాయపడ్డాయి. చిన్నప్పటి నుంచే షిప్ మోడలింగ్ నా అభిరుచిగా కొనసాగుతోంది. ఏ ఆదాయం లేనప్పుడు బల్సా కలపను కొనుగోలు చేసి, మోడళ్లను సృష్టించడం ప్రాక్టీస్ చేశాను. సాధారణ కొలతలకు పెద్ద పెద్ద మోడల్ షిప్ చేసేటప్పుడు అనుసరించే కొలతల్లో తేడా ఉంటుంది. ఉదాహరణకు ఓ మోడల్‌లోని 1 అడుగు.. అసలు ఓడలో 100 అడుగులకు సమానం. ప్రతిదీ దానికి అనుగుణంగా కొలతలు తీసుకుని నిర్మించినప్పుడే దాని ప్రతిరూపాన్ని అచ్చంగా, పర్‌ఫెక్ట్‌గా చూపించగలుగుతాం. మోడల్ ఆధారంగా ఒక్కో దాన్ని పూర్తి చేయడానికి నెల నుంచి మూడు నెలల వరకు టైమ్ పడుతుంది. రిమోట్-కంట్రోల్డ్ బోట్ మోడల్స్‌ కూడా తయారుచేయమని కస్టమర్స్ అడుగుతున్నారు. కానీ ఇంకా ఆ తరహా టెక్నాలజీ నేర్చుకునే క్రమంలో ఉన్నాను’ – అమలనాథన్, షిప్ మోడలింగ్ ఆర్టిస్ట్

Next Story

Most Viewed