ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్: సీఎం అరవింద్ కేజ్రీవాల్

by  |
ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్: సీఎం అరవింద్ కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ: దేశరాజధానిలో ప్రస్తుతం కరోనా మూడో తరంగం (Third Wave) ప్రారంభమైందని, దీన్ని ఎదుర్కోవడానికి తాము సమాయత్తమవుతున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అంతేకాదు, పండుగ సీజన్‌లో బాణాసంచా కాల్చడంపైనా నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు. ‘ఇటీవలే ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ భారీగా వెలుగుచూస్తున్నాయి. దీన్ని మనం థర్డ్ వేవ్‌గా భావించవచ్చు. దీనిపై త్వరలో మేం రివ్యూ సమావేశాన్ని నిర్వహిస్తాం. ఎమర్జెన్సీ సమయాల్లో పడకల కొరత లేకుండా చూసుకోవడానికి అధికారులు ప్రిపేర్ అవుతున్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో 80 శాతం ఐసీయూ బెడ్లు కరోనా పేషెంట్లకు రిజర్వ్ చేయాలన్న తమ ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.

Next Story

Most Viewed