కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురకలు.. అంతలోనే!

by  |
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురకలు.. అంతలోనే!
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురకలంటించింది. కమర్షియల్ ఫ్లైట్‌ల కోసం కాదు, ముందు పౌరుల ఆరోగ్యం కోసం దృష్టి సారించాలని హితవు పలికింది. నాన్ షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌(విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలిస్తున్న విమానాలు)లో మధ్య సీట్లను ఖాళీ ఉంచాలని మార్చి 23న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ సర్క్యూలర్ జారీ చేసింది. తాజాగా, ఈ ఉత్తర్వులను సవరిస్తూ మరో సర్క్యూలర్ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ.. ఓ ఎయిర్ ఇండియా పైలట్ బాంబే హైకోర్టను ఆశ్రయించారు. సామాజిక దూరాన్ని ఖాతరు చేయడంలేదని ఆరోపించారు. కాగా, ఈ పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం, ఎయిర్ ఇండియా సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ విచారణలో భాగంగానే ప్రభుత్వానికి చురకలంటించింది. కమర్షియల్ ఫ్లైట్స్ కన్నా ముందు పౌరుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం తపన పడాలని హితవు పలికింది. చివరికి జూన్ 6వ తేదీ వరకు మధ్య సీటు ఖాళీగా ఉంచకుండా సేవలు అందించవచ్చునని అనుమతినివ్వడం గమనార్హం.

Next Story

Most Viewed