- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత నేరస్తుడు మరోసారి అరెస్ట్
<p>దిశ, ఎల్బీనగర్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ అలియాస్ బాజీ(22) లేబర్, క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. విలాసావంతమైన జీవితం గడపడం కోసం దొంగతనాలకు అలవాటుపడ్డాడు. 2014లో గుంటూరులో దొంగతనం చేసి జూవైనల్ హోమ్‌కు వెళ్లొచ్చాడు. 2019లో సరూర్ నగర్ […]</p>

దిశ, ఎల్బీనగర్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ అలియాస్ బాజీ(22) లేబర్, క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. విలాసావంతమైన జీవితం గడపడం కోసం దొంగతనాలకు అలవాటుపడ్డాడు. 2014లో గుంటూరులో దొంగతనం చేసి జూవైనల్ హోమ్‌కు వెళ్లొచ్చాడు. 2019లో సరూర్ నగర్ పరిధిలో రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడి మరోసారి జైలుకు వెళ్లాడు. 2020, ఫిబ్రవరిలో రెండు కేసుల్లో కూడా మళ్లీ జైలుకు వెళ్లి విడుదల అయ్యాడు. రాత్రిపూట కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటాడు. చోరీలకు పాల్పడగా దొరికిన వస్తువులను విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలకు ఖర్చు చేస్తుంటాడు పోలీసులు వెల్లడించారు.






