- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి అంత్యక్రియలకు వెళ్తే.. ఇంట్లో దొంగలు పడ్డారు
by Batti.Sumithra |
<p>దిశ, నర్సంపేట : అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని సొమ్ము దొంగతనానికి గురైన సంఘటన నర్సంపేట పట్టణంలోని సుభాష్ బొమ్మ కూడలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సయ్యద్ అజ్మత్ అనే వ్యక్తి స్థానికంగా పాత సామాన్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి చనిపోవడంతో అంత్యక్రియలు చేయడానికి వెళ్లి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చాడు. ఇదే సమయంలో ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. 3 లక్షల నగదు సహా 4 తులాల బంగారం, 30 తులాల […]</p>

X
దిశ, నర్సంపేట : అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని సొమ్ము దొంగతనానికి గురైన సంఘటన నర్సంపేట పట్టణంలోని సుభాష్ బొమ్మ కూడలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సయ్యద్ అజ్మత్ అనే వ్యక్తి స్థానికంగా పాత సామాన్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి చనిపోవడంతో అంత్యక్రియలు చేయడానికి వెళ్లి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చాడు. ఇదే సమయంలో ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. 3 లక్షల నగదు సహా 4 తులాల బంగారం, 30 తులాల వెండి చోరీకి గురైనట్లు అజ్మద్ తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
- Tags
- narsampet
Next Story






