తెరుచుకున్న థియేటర్లు..ఆడియన్స్ రెస్పాన్స్?

by  |
తెరుచుకున్న థియేటర్లు..ఆడియన్స్ రెస్పాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా..24 క్రాఫ్ట్స్ అసోసియేషన్. నిర్మాతల ప్రాణం..దర్శకుల జీవం..నటుల జీవనం..సినీ కార్మికుల జీవితం. థియేటర్ యాజమాన్యాల జీవన ప్రయాణం. ఇంత మందికి ఆనందాన్నిచ్చేవి కేవలం లైట్స్, కెమెరా, యాక్షన్ అనే మూడు మ్యాజికల్ వర్డ్స్ అయితే, వారి లైఫ్‌ను డిసైడ్ చేసేది థియేటర్స్, ప్రేక్షకులు మాత్రమే. ఒక సినిమా థియేటర్‌కు వస్తేనే ఇంత మంది జీవితం నిలబడుతుంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా సినిమా హాళ్లు మూతపడటంతో కళను నమ్ముకున్న బతుకులు ఆగమయ్యాయి. దాదాపు తొమ్మిది నెలలుగా అదే బాధలో ఉండగా శుక్రవారం నుంచి తెలంగాణలో సినిమా హాళ్లు తెరుచుకోవడంతో మళ్లీ సినిమా సందడి ప్రారంభం అయింది.

చాలా కాలం తర్వాత సినీ లవర్స్ బిగ్ స్క్రీన్‌పై మూవీ ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రసాద్ మల్టీప్లెక్స్, పీవీఆర్ సినిమాస్, ఏఎంబీ సినిమాస్ ఆడియన్స్‌కు హార్టీ వెల్‌కమ్ చెప్పగా..కొవిడ్ రూల్స్ పాటిస్తూనే సినిమాను సెలెబ్రేట్ చేసుకున్నారు సినీ ప్రియులు. కరోనా మహమ్మారి భయం నడుమే 50 % ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు ప్రారంభం కాగా.. సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యలో నార్మల్ థియేటర్స్, మల్టీప్లెక్స్‌లకు మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. ప్రస్తుతం హాలీవుడ్ మూవీస్ టెనెట్, కమ్ ప్లే.. బాలీవుడ్ మూవీస్ వార్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలు థియేటర్లలో ఆడుతుండగా మల్టీప్లెక్సులు ఫుల్‌గా నిండిపోయాయి. కానీ, నార్మల్ థియేటర్స్‌లో మాత్రం 30 శాతం ఆక్యుపెన్సీ కూడా లేదు. మల్టీప్లెక్స్‌లో కొవిడ్ రూల్స్ పాటిస్తారు..సాధారణ థియేటర్స్ అంతగా ఫాలో కారు అనేది ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది.

సాధారణంగా 100 శాతం ఆక్యుపెన్సీతో ఒక్క సినిమా ఆడితే షోకు రూ.1,50,000 కలెక్షన్ రావాలి అంటున్నారు. సినిమా హాళ్ల యాజమానులు. ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీ ఉంది, పైగా కరోనా పరిస్థితి కాబట్టి..యజమానులు రూ.50 వేల కలెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ, అది కూడా రీచ్ కాలేదని ఫస్ట్ షోకు రూ.10,000 -11,000 కలెక్షన్ మాత్రమే వచ్చిందని చెప్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టం అంటున్నారు. ప్రేక్షకుల సంఖ్యను పెంచేందుకు యూనియన్ తరఫున నిర్ణయం తీసుకుని ఆఫర్స్ ప్రకటించే అవకాశం ఉందని..దీనిపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం షోస్ పెంచుకునేందుకు అనుమతించినా సరే.. క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి అలాంటి సాహసం చేసే పరిస్థితుల్లో లేమంటున్నారు. ఇక ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా లేకపోవడం అనేది మరో డ్రా బ్యాక్ అంటున్నారు.

సినీ సెలెబ్రిటీల ప్రయత్నం
ప్రేక్షక దేవుళ్లను థియేటర్స్‌కు రప్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు సినీ సెలెబ్రిటీలు. డైరెక్టర్ మారుతి, హీరో సాయి ధరమ్ తేజ్ లాంటి స్టార్స్ థియేటర్లలో తిరుగుతూ సినిమాను సెలెబ్రేట్ చేసుకుందామని పిలుపునిచ్చారు. మరి ఈ పిలుపు కేవలం మల్టీప్లెక్స్‌ల వరకే పరిమితం అవుతుందా? లేక నార్మల్ థియేటర్స్‌కు కూడా ప్లస్ అవుతుందా చూడాలి.


Next Story

Most Viewed