ఎమ్మెల్సీ పల్లా చెల్లెల్ని.. నామాటే ఖాతరు చేయరా..!

by  |
palla rajeshwar reddy
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: ఎమ్మెల్సీ చెల్లెల్ని స్థానిక జడ్పీటీసీని నా మాటే ఖాతరు చేయరా అన్నట్టుగా వరంగల్ అర్బన్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం వేలేరు మండలం పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెల్లెలు స్థానిక జడ్పీటీసీ చాడ సరిత ఆధిపత్యం కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి అక్రమ రవాణాకు పాల్పడిన ఒకరికి రూ.75000 జరిమానా విధించిన సంఘటనలో తహసీల్దార్ విజయలక్ష్మి తన సూచనలను పట్టిచుకోలేదని జడ్పీటీసీ సరితారెడ్డి ఏకంగా ఆమెను బదిలీ చేయించినట్లు మండల ప్రజలు చర్చికుంటున్నారు.

ఇటీవల మండలంలో మట్టి తరలింపు విషయంలో తహసీల్దార్ వర్సెస్ జడ్పీటీసీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న అప్పటి తహసీల్దార్ విజయలక్ష్మి వాహనాన్ని సీజ్ చేసి రూ. 75 వేల జరిమానా విధించారు. దీన్ని అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు సమర్పించినప్పటికీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి చెల్లెలు, జడ్పీటీసీ రూ. 25 వేలు మాత్రమే వేయాలని తహసీల్దార్ విజయలక్ష్మికి సూచించారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో మరునాడే ఆమె బదిలీ కావడం జరిగింది. ఎమ్మెల్సీ చెల్లెల్ని స్థానిక జడ్పీటీసీని నా మాటే ఖాతరు చేయరా? అన్న తరహాలో తహసీల్దార్ విజయలక్ష్మి బదిలీ చేయించినట్లుగా జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.


Next Story

Most Viewed