ఘోరం..కోతులకు విషమిచ్చి చంపి.. ఆపై

by  |
ఘోరం..కోతులకు విషమిచ్చి చంపి.. ఆపై
X

దిశ, డైనమిక్ బ్యూరో : కోతులను దైవసమానంగా చూస్తూనే వాటిపై మరో వైపు క్రూరత్వంగా వ్యవహరిస్తున్నారు. అడవులన్ని అంతమవుతుండటంతో జనావాసాల్లోకి, పొలాల్లోకి వస్తున్న వానరాలు భయాందోళనతో బతకాల్సి వస్తుంది. కొన్ని చోట్ల వాటిపై దాడి చేసి అడవుల్లోకి వెల్లగొడుతున్నారు. తాజాగా.. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా పారుతుంటే.. రెండూర్ల ప్రజలు వానరాలను తరుముతుంటే.. ఎటు వెళ్లాల్లో తెలియక గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వీడియోని చూశాం. గుళ్లల్లో ఉన్న వానరాలను పూజించి పొలాల్లోకి వస్తే తరిమేస్తున్నారు.

అయితే ఇటువంటి హృదయవిదారక సంఘటన కర్ణాటక‌లోని కోలార్​జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడ ఏకంగా గుర్తు తెలియని వ్యక్తులు 16 కోతులకు విషం పెట్టి మరీ చంపారు. వాటి కళేబరాలను సంచుల్లో వేసి జిల్లాలోని తమక సమీపంలోని రోడ్డు పక్కన పడేశారు. సమాచారం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు కోతుల కళేబరాలను పోస్టుమార్టం చేయగా… విషపూరిత ఆహారం తినడం వల్లే కోతులు చనిపోయినట్లు పశుసంవర్ధక శాఖ వైద్యులు వెల్లడించారు. చనిపోయిన కోతుల అంత్యక్రియలను అటవీ శాఖ సిబ్బంది పూర్తి చేశారు.



Next Story