పెళ్లి ఆలస్యం అయితే అమ్మాయిలు తిరుగుబోతులు అవుతారట..! : అబ్బాస్ నఖ్వీ

by  |
పెళ్లి ఆలస్యం అయితే అమ్మాయిలు తిరుగుబోతులు అవుతారట..! : అబ్బాస్ నఖ్వీ
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రం కేబినేట్ తీసుకువచ్చిన మహిళల వివాహ వయసు పై రాజకీయ పార్టీల మధ్యన మాటల తుటాలు పేలుతున్నాయి. ఇటీవల ఎస్పీ ఎంపీలు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ దీన్ని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కనీస వయస్సు పెంచడం ఎందుకు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాబోయే శీతాకాల సమావేశంలో ఈ సవరణ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అయితే ఇంతలో బీజేపీ కి చెందిన మైనారిటీ శాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహిళల వివాహ వయస్సు పై చాలా మంది మాట్లాడుతున్నారు. కొంత మంది మహిళలను కించపరిచే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు అవి మానుకోవాలని హితవు పలికారు. 21 ఎళ్ల వరకూ మహిళలకు వివాహం చేయక పోతే వారు తిరుగుబోతులు అవుతారని కొదరు మాట్లాడుతున్నారు.. వారి మాటలను నేను ఏకీభవించను. ఈ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పెళ్లి ఆలస్యం అయితే తిరుగుబతోతులు ఎందుకు అవుతారని ప్రశ్నించారు.

అలాంటి మాటలను పట్టించుకోవద్దని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. అలా మాట్లాడిన వాళ్లది హిందూస్తాన్ మనస్థత్వం కాదని కౄరమైన తాలిబాన్ మనస్థత్వమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి మాటలు ఏ నాయకుడు మాట్లాడాడు అనే ప్రశ్నకు మాత్రం ఆయన జవాబు ఇవ్వలేదు.



Next Story

Most Viewed