కంది రైతులకు కష్టకాలమే..

by  |
కంది రైతులకు కష్టకాలమే..
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కంది రైతుకు కష్టకాలమే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు కత్తికట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ యేడు దిగుబడి ఆశాజనకంగా ఉన్నా నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. రంగారెడ్డి జిల్లాలో 42వేల మెట్రిక్​ టన్నులు, వికారాబాద్​ జిల్లాలో లక్షా50వేల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ, రంగారెడ్డి జిల్లాలో 4వేల మెట్రిక్ టన్నులు, వికారాబాద్​ జిల్లాలో 18 వేల మెట్రిక్ టన్నుల కందులను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినట్లు సమాచారం. దీంతో అధికారులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు తెలిసింది. క్వింటాలు కందికి మద్దతు ధర రూ.6 వేలు ప్రకటించిన ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మార్కెట్‌ యార్డులతో పాటు పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పంట చేతికొచ్చి 15రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కంది పంటకు పెట్టింది పేరు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఈ జిల్లాలోనే రైతులు అత్యధికంగా రైతులు సాగుచేస్తారు. అందుకనుగుణంగానే కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. పంట చేతికొచ్చినా నేటి వరకు కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన విధంగానే కందుల కొనుగోలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కానీ, అంచనాలకు, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సూచించిన లెక్కలకు పొంతన లేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లాలో 42వేల మెట్రిక్ టన్నులు, వికారాబాద్ జిల్లాలో లక్షా50వేల మెట్రిక్ టన్నుల కందుల దిగుబడి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 4వేల మెట్రిక్ టన్నులు, వికారాబాద్లో 18 వేల మెట్రిక్ టన్నుల కందులను మాత్రమే కొనుగోలు కొనుగోలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. దీంతో అధికారులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాలోని అంచనాలను లేఖ ద్వారా పంపిస్తున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేం ద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. ఈ లేఖలతోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రారంభమవుతుందా, లేకపోతే కాలయాపన చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాతే…

గతంలోలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే సేం దుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రభుత్వం ఆదేశాలతోనే కొను గోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం జరుగుతుందని వివరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదించిన కందుల కొనుగోలు లెక్కలు ఆమోదించిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో కందిపంట చేతి కొచ్చింది. రైతులు కోతలు ప్రారంభించి 15రోజులవుతుంది. కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేస్తే విక్రయించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ, ఇంకా ప్రభుత్వాలు కేంద్రాల ఏర్పా టులో మీనామేషాలు లెక్కిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనలు రాష్ట్రానికి చేరేది ఎప్పుడు? అధికారులకు ఆదేశాలు ఎప్పుడు జారీ చేస్తారో వేచి చూడాల్సిందే.

మద్దతు ధర రూ.6వేలు…

రంగారెడ్డి జిల్లాలో ఈ సారి 82,554 ఎకరాల విస్తీర్ణంలో కంది పంట సాగు చేసేందుకు ప్రణాళిక తయారు చేయగా 69,808.21 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ సాగుకు అనుగుణంగా 42వేల మెట్రిక్ టన్నులు దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. వికారాబాద్ జిల్లాలో 1,82,913 ఎకరాల విస్తీర్ణంలో కంది సాగు చేయగా, దిగుబడి లక్షా50వేల మెట్రిక్ టన్నుల వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్వింటాలు కందికి మద్దతు ధర రూ.6 వేలు ఇవ్వనున్నారు. దిగుబడి అంచనాకు అనుగుణంగా రంగారెడ్డి జిల్లాలో 7 వరకు, వికారాబాద్ జిల్లాలో ప్రతీ మండల కేంద్రంలో ఒక కొనుగోలు కేంద్రం చొప్పున ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గతేడాది మార్క్‌ఫెడ్‌, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో కంది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో భారీఎత్తున అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఎలాంటి ప్రచారం లేకుండానే డీసీఎంఎస్​ను పక్కకు తప్పించాలని యోచిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మార్కెట్‌ యార్డులతోపాటు పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

దిగుబడి అధికం..

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే నియంత్రిత సాగు విధానాన్ని రైతులు అమలు చేశారు. అందుకు అనుగుణంగా కంది సాగు చేశారు. దీంతో భారీగా దిగుబడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కొనుగోలు చేసిన కందుల కంటే అతి తక్కువగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో 42 వేల మెట్రిక్ టన్నుల దిగుబడికి కేవలం 4వేల మెట్రిక్ టన్నులు… వికారాబాద్ జిల్లాలో లక్షా50వేల మెట్రిక్ టన్నుల దిగుబడికి 18వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనాల లెక్కలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. దిగుబడి అధికంగా ఉన్నప్పుడు కొనుగోళ్లను పావువంతుకు తక్కువగా పరిమితం చేయడం వెనుక ప్రభుత్వాల వైఖరి ఏమిటీ అని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed