పంచుడు లొల్లి.. ఓటర్లకు ఇచ్చేది తక్కువే నొక్కేదే ఎక్కువ

by GSrikanth |
పంచుడు లొల్లి.. ఓటర్లకు ఇచ్చేది తక్కువే నొక్కేదే ఎక్కువ
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ఎన్నికల ప్రచారానికి తెరపెడింది.. ఇక ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తెరలేపారు. మద్యం, నగదును జోరు గా పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాయిలాల పంపిణీ లో ద్వితీయ శ్రేణి నేతలకు కిందిస్థాయి కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. అభ్యర్థులు ఇచ్చింది ఏంత? మీరు ఓటర్ల కు పంచేది ఎంత? అని కార్యకర్తలు నిలదీస్తున్నారు.

పంపకాల్లో తేడాలు..

మల్కాజిగిరి లోక్‌సభ స్థానంతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ జాతీయ పార్టీ ఓటర్ల ను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నా యి. పంపకాల్లో ద్వితీయ శ్రేణి నాయకుల చేతివాటం ప్రదర్శించడం హాట్ టాఫిక్‌గా మారిం ది. బస్తీల్లో ఒక్కో ఓటుకు రూ. 2 వేలు పంపిణీ చేయాలని పార్టీ నిర్ణయిస్తే రూ. వెయ్యి మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిసింది. కాగా ఆ పార్టీకి కొంత వ్యతిరేకత ఉన్న ప్రాం తాల్లో ఒక్కో ఓటరుకు రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అక్కడ ద్వితీయ శ్రేణి నేతలు రూ. 3 వేలకు బదులుగా రూ.1500 మాత్రమే పంపిణీ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

డివిజన్ స్థాయి నేతల తీరుతో తాము పోల్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఓటర్లను కలవలేకపోతున్నట్లు కార్యకర్తలు ఆందోళ న చేస్తున్నారు. అభ్యర్థులు, పార్టీ ఇచ్చిన డబ్బులో ద్వితీయ శ్రేణి నాయకులే పెద్ద మొత్తం లో మింగేస్తున్నారని, దీంతో తాము ఓటర్లకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొంద ని అంటున్నారు. ప్రత్యర్థి పార్టీ లు పెద్ద మొత్తంలో పంపిణీ చేస్తున్నారంటూ అభ్యర్థుల నుం చి ప్రధాన అనుచరుల నుంచి భారీగా రాబట్టకుంటున్నారు. కానీ ఏదో ఒకటి, రెండు కాల నీలు, బస్తీల్లో పంపిణీ చేసి మిగతా కాలనీలకు మొండి చేయి చూపుతున్నారని ప్రధాన పార్టీకి చెందిన ఓ కార్యకర్త చెప్పారు. తాము ప్రచారం చేసిన కాలనీ, బస్తీల్లో ఓటర్లను ఆరా తీస్తే సగం తగ్గించి ఇస్తున్నారని తెలియజేస్తున్నారని తెలిపారు. రూ.2 వేలు ఇవ్వాల్సిన చోట రూ.వెయ్యి పంపిణీ చేసినట్లు చెబుతున్నారు.

48 గంటలే కీలకం

పోల్ మేనేజ్‌మెంట్‌కు ఈ 48 గంటలే కీలకం. శని, ఆదివారాలే కీలకం కానున్నాయి. ఈ క్రమంలో శనివారం సాయం త్రం నుంచి ఆదివారం రాత్రి వరకు ఓటర్లకు డబ్బు, మద్యం కానుకలు పంపిణీ చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టిసారించారు. కింది స్థాయిలో పంపకాల్లో గందరగోళం నెల కొంది. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, బస్తీల్లో ఉండే వివిధ సం ఘాల నాయకులు, ప్రతినిధులతో నిరంతరం సంబంధా లు కొనసాగించే తాము చివరకు పంపకాల వద్ద ముఖం చాటేయాల్సి రావడం ఇబ్బందిగా ఉందని కార్యకర్తలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. మద్యం బాటిళ్లను కూడా మాయం చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ ఇన్‌చార్జీల దృష్టికి తీసుకువెళ్లడంతో ద్వితీయ శ్రేణి లీడర్ల పంపకాలపై ఆరాతీసినట్లు సమాచారం. కార్యకర్తలు చెప్పింది నిజం కావడంతో అధిష్టాన పెద్దలు నగదును నొక్కేస్తున్న నేతలపై సీరియస్ అయినట్లు తెలిసింది.Next Story

Most Viewed