భద్రాచలంలో వేగంగా పెరుగుతోన్న గోదావరి నీటిమట్టం

by  |
Godavari
X

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల సమయంలో 39.80 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం రాత్రి 10 గంటలకు 41.50 అడుగులకు చేరుకుంది. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే ఈ రాత్రికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. గులాబ్ తుపాను ప్రభావంతో కురిసిన జోరు వానలకు ఎగువన ఉన్న పలు ప్రాజెక్టులు, రిజర్వాయర్‌లు నిండి గేట్లు ఎత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి గంటగంటకు పెరుగుతోంది.

భద్రాచలంలో 48 అడుగుల దగ్గర రెండవ, 53 అడుగుల వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. క్రమేపీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టాన్ని అంచనా వేస్తూ సీడబ్ల్యూసీ అధికారులు గంటగంటకు సమాచారం ఇస్తున్నారు. దీంతో ప్లడ్ డ్యూటీ అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి వరద ప్రవాహం మరింతగా పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.



Next Story

Most Viewed