Porn videos: రివేంజ్ ‘పోర్న్’.. రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యే చాన్స్.!

463
Deepfake Porn

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ హంగులు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి వికాసానికి తోడ్పడుతున్నాయో.. అంతటి వినాశనానికీ కారణమవుతున్నాయి. ఈ రోజుల్లో మంచి, చెడు దేనికైనా సోషల్ మీడియానే వేదిక కాగా.. పాజిటివిటీ గురించి పక్కనబెడితే, నెగెటివిటీకి మాత్రం ఆన్‌లైన్ ప్రపంచమే కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇప్పుడు రాజ్యాలు గెలవాలంటే యుద్ధాలు చేయాల్సిన పనిలేదు. వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవాలంటే వ్యూహాలు పన్నాల్సిన అవసరం అంతకన్నా లేదు.

జస్ట్ డిజిటల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే లేదంటే ఫేక్ వీడియోలను సృష్టించి చేతులు దులుపుకుంటే చాలు! కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు.. ఇక పగ, ప్రతీకారం పబ్లిక్ అయిపోతాయి. కానీ క్రియేటివిటీ ముసుగులో చేసిన పని ఎన్ని పరిణామాలకు దారితీస్తుందో ఊహించలేం. ఎందరు ఫిల్మ్, పొలిటికల్ సెలబ్రిటీల జీవితాలను అతలాకుతలం చేస్తుందో చెప్పలేం. ఎంతటి రాజకీయ వైరాలకు, సంక్షోభాలకు తెరతీస్తుందో వర్ణించలేం. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అనేక అసంభవ దృశ్యాలకు ‘డీప్ ఫేక్స్’ వీడియోలు కారణమవుతుండగా.. పోర్న్ స్టార్స్, సెక్స్ వర్కర్ల జీవితాలపై ఇవి ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? డిజిటల్ మీడియాలో ఎంత పవర్‌ఫుల్ జోనర్‌గా మారాయి? అగ్రరాజ్యాల అధినేతలు సహా సాధారణ గృహిణుల ప్రతిష్టను దిగజార్చిన మార్ఫింగ్ వీడియోలపై సండే స్పెషల్..

మూడు సంవత్సరాలుగా ‘డీప్ ఫేక్స్’గా ప్రచారంలో ఉన్న ఆల్టర్డ్ వీడియోలు అనేక దేశాలకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. మొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రియలిస్టిక్ వీడియోలను రూపొందించిన క్రియేటర్స్.. 2017 నుంచి అనామక యూజర్లు ‘రెడిట్’ వంటి మెసేజ్ బోర్డులపై ఈ మార్ఫింగ్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ డీప్‌ఫేక్స్‌ మేకింగ్‌కు ఒకప్పుడు AI-ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం అవసరమయ్యేది. కానీ నేడు, ఫేక్‌యాప్ లేదా ఫేస్‌స్వాప్ వంటి ఉచిత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఎవరైనా ఇలాంటి వీడియోలను తయారుచేసే అవకాశం ఉంది. దీనికి కావలసిందల్లా కొంత శాంపిల్ ఫుటేజ్, ఫొటోలకు సంబంధించి పెద్ద మొత్తంలో డేటా. వీటి సాయంతో యాప్ ద్వారా ఒక వ్యక్తి ముఖాన్ని మరొకరి శరీరానికి సెట్ చేయడం ద్వారా ఫేక్ వీడియోస్ మేకింగ్ జరుగుతోంది. ఎక్కువగా ప్రముఖులే వీటి బారిన పడుతుండగా.. వారి హై క్వాలిటీ ఫేషియల్ ఇమేజెస్ ఇంటర్నెట్‌లో సులభంగా లభించడమే అందుకు కారణం.

రాజకీయ ప్రకంపనలకు అవకాశం..

కాగా డీప్ ఫేక్ వీడియోలు రాజకీయ వినాశనాన్ని సృష్టించడంతో పాటు మీడియాపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేసే చాన్స్ ఉంది. ఈ మేరకు బరాక్ ఒబామా డొనాల్డ్ ట్రంప్‌ను ‘కంప్లీట్ డిప్‌షిట్’ అన్నట్టుగా AI ఆధారిత వీడియో ఒకటి బయటికొచ్చింది. ఇక బెల్జియంలో.. పారిస్ క్లైమేట్ ఒప్పందంలో ఆ దేశం పాల్గొనడాన్ని ట్రంప్ ఎగతాళి చేసినట్టు అక్కడి పొలిటికల్ పార్టీ డీప్ ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేసింది. మరో యూజర్ ట్రంప్ స్పీచ్ ఇస్తున్న ఫుటేజ్‌లో తన ఫేస్‌ను కెనడా బిజినెస్ మ్యాన్ ఫేస్‌తో రీప్లేస్ చేశాడు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రకంపనలు కలిగించినప్పటికీ జాతీయ భద్రతా ప్రమాదాలను ప్రతిబింబించలేదు. అయితే భవిష్యత్తు ఇలానే ఉంటుందని చెప్పలేం. కొత్త కొత్త పద్ధతుల్లో డీప్ ఫేక్స్ రూపొందించే ప్రమాదముంది. వాయిస్ క్లోనింగ్‌ను వీటికి సక్సెస్‌ఫుల్‌గా యాడ్ చేయగలిగితే రాజకీయ అస్త్రాలుగానూ ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇది నేషనల్ సెక్యూరిటీని ప్రమాదంలో పడేసే పరిస్థితులకు దారితీస్తుంది. అంతేకాదు ప్రస్తుతం అశ్లీల చిత్రాల తయారీకి ఈ టెక్నాలజీని వాడుతున్న ఆరోపణలూ ఉన్నాయి.

స్టార్స్‌తో పాటు సాధారణ గృహిణులకు ముప్పు..

సైబర్ సెక్యూరిటీ కంపెనీ డీప్‌ట్రాస్ ల్యాబ్స్ 2019 స్టడీ ప్రకారం.. అసభ్యకర లైంగిక దృశ్యాల్లో 96 % డీప్ ఫేక్స్ ఉన్నట్టు వెల్లడైంది. ఇప్పటికే ‘గాల్ గాడిట్, టేలర్ స్విఫ్ట్, స్కార్లెట్ జాన్సన్, ఎమ్మా వాట్సన్‌తో పాటు పదిహేడేళ్ల టిక్‌టాక్ స్టార్ చార్లీ డి అమిలియో ముఖచిత్రాలను పోర్న్ స్టార్ల బాడీలతో మిక్స్ చేసిన వేల క్లిప్పింగ్స్ ఇంటర్నెట్‌లో ఉన్నట్టు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అంతేకాదు మాజీ భార్యలు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, హై స్కూల్ క్రషెస్‌.. ఇలా ఎటువంటి ఫేమ్ లేని మహిళలపైనా డీప్ ఫేక్స్ క్రియేట్ చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం కాగా, నాన్ ఫేమ్ పర్సనాలిటీల విషయంలో ప్రతీకార చర్యల్లో భాగంగానే అని తెలుస్తోంది. నిజానికి ఇందులో కనిపించే దృశ్యాల్లో స్పష్టత లోపించడం, బాడీ మిక్సింగ్‌లో లోపాలు, వాయిస్ మ్యాచింగ్‌లో తేడాలను గుర్తించొచ్చు. కానీ ఇక్కడ రియాలిటీ అనేది సమస్య కాదు. ఇవి కల్పితాలని లేబుల్ చేయబడ్డా సరే కొందరు క్రియేటర్స్ మాత్రం.. ఆ వీడియోలకు ఉండే ఫ్యాన్ ఫిక్షన్, మీడియా ప్రచారంపై గర్వంగా ఫీల్ అవుతుంటారు.

రైట్స్ కోల్పోతున్న సెక్స్ వర్కర్స్‌..

పోర్న్ వీడియోల విషయానికొస్తే.. సంబంధిత డీప్ ఫేక్ వీడియోల్లో కనిపించేది తాము కాకపోయినా, అవి సృష్టించే ఇంపాక్ట్ కారణంగా ముప్పును ఎదుర్కొంటారు. ఈ క్రమంలో శక్తిహీనులుగా మారి సెక్సువల్ అబ్యూస్‌కు గురవుతుంటారు. ఇక చాలా వరకు పోర్న్ సైట్లు.. సెక్స్ వీడియోలను మోడరేట్ చేయనీయకుండా బ్యాన్ విధించినప్పటికీ.. షేరింగ్, రీ అప్‌లోడింగ్‌కు అడ్డుకట్ట వేసే చాన్స్ లేకపోవడంతో పోర్న్ డీప్ ఫేక్స్ విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. పోర్న్ సైట్లు తమ వీడియోలు పైరసీకి గురికాకుండా ప్రామాణిక పద్ధతిని ఫాలో అవుతున్నా, దొంగిలించిబడిన పోర్న్ కంటెంట్‌ ద్వారా కలిగే ఆత్మసంతృప్తి వల్ల డీప్ ఫేక్స్ ప్రయోజనం పొందుతున్నారు.

తద్వారా అమాయక మహిళలు క్షోభకు గురవుతుండగా, డిజిటల్ మాయ వల్ల తమ శ్రమను కోల్పోతున్న సెక్స్ వర్కర్లు కూడా ప్రొఫెషనల్‌గా ముప్పును ఎదుర్కొంటూ సర్వైవ్ కాలేకపోతున్నారు. తమ సొంత శరీరాలపై ఇతరుల ముఖ చిత్రాలను సెట్ చేయడం వల్ల ఆ వీడియోలపై హక్కులను కోల్పోతున్నారు. వారు రెమ్యునరేషన్ కోసమే ఈ వీడియోల్లో నటిస్తారు. ఇది ఒప్పందం ప్రకారం చిత్రీకరించబడినా, అందులో పర్‌ఫార్మ్ చేసినవారి అనుమతి లేకుండా మార్ఫింగ్ చేయడం భౌతికంగా, నైతికంగా అవమానించడమే. అయితే డీప్‌ఫేక్స్‌ను పరువు నష్టం కోణంలో ఎదుర్కోవడం సెక్స్ వర్కర్లకు కష్టం కనుక డిజిటల్ ఎకానమీలో భాగంగా పోర్న్‌ను తీవ్రంగా పరిగణించి, కాపీరైట్ ఉల్లంఘన కింద డీప్‌ఫేకింగ్‌ను కట్టడిచేయడమే సరైన పరిష్కారం.

ఫ్యూచర్‌లో అన్ని రంగాలకు ప్రమాదమే..

మ్యూజిషియన్స్, ఫిల్మ్ మేకర్స్, రైటర్స్‌ మాదిరిగానే పోర్న్ పర్ఫార్మర్స్‌ కూడా క్రియేటివ్ అవుట్‌పుట్ హక్కులు కలిగి ఉంటారు. కానీ పోర్న్ ఇండస్ట్రీకి ఉన్న పరిమితులు, సొసైటీలో ఉన్న దృక్పథం కారణంగా మిగతా ఇండస్ట్రీల వలె వారు తమ హక్కుల కోసం పోరాడటం కష్టం. శృంగారాన్ని బహిరంగంగా ప్రదర్శించే సంస్కృతిని ఏ సమాజమైనా ఒప్పుకునే పరిస్థితి లేదు. అందుకే సెక్స్ వర్కర్ల ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కొద్దిమంది దోచుకుంటున్నారు. ప్రస్తుతం పోర్న్ ఇండస్ట్రీ, సెక్స్ వర్కర్లు మాత్రమే ఈ సమస్య ఎదుర్కొంటుండగా.. భవిష్యత్తులో అన్ని రంగాలకు డీప్ ఫేక్స్ వ్యాపించే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుతం డిజిటల్ మీడియాలో సరికొత్త పవర్‌ఫుల్ జోనర్‌గా అవతరించిన డీప్ ఫేక్స్.. సోషల్ సెటైర్, ఫాంటసీ బిల్డింగ్‌తో పాటు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే సామర్థ్యాలతో కూడిన క్రియేటివ్ ప్రాక్టీస్‌ను రిప్రజెంట్ చేస్తున్నాయి. అదే సమయంలో పవర్‌ఫుల్ పీపుల్‌ను టార్గెట్ చేయడమే కాక పొలిటికల్ డిస్‌ఇన్‌ఫర్మేషన్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు సర్క్యులేట్ అయిన డీప్ ఫేక్స్‌.. ‘కామిక్ వే’లోనే ప్రజెంట్ కాగా, టెక్నాలజీ పెరిగే కొద్దీ రూపం మార్చుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలో పొలిటికల్ వెపన్స్‌గా దూసుకొచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..