బీజేపీ,కాంగ్రెస్‌ల‌ది అక్ర‌మ సంబంధం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే

by  |
బీజేపీ,కాంగ్రెస్‌ల‌ది అక్ర‌మ సంబంధం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే
X

దిశ‌, అందోల్ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో ఒక్కటై, కేసీఆర్‌ను ఓడించడ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని, ఇరు పార్టీల‌ది అక్రమ సంబంధ‌మేన‌ని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిర‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. బీజేపీ న‌మ్ముకుని కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయం చేస్తుంద‌ని, రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆర్‌డీఓ కార్యాల‌యంలో ఓటు హ‌క్కుని వినియోగించుకున్న అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేప‌డుతున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాల‌పై కాంగ్రెస్ పార్టీ నోరు మెద‌ప‌క‌పోవడ‌మేమిట‌ని, కేంద్రంపై త‌న వైఖరిని స్పష్టం చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

దుబ్బాక‌, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, బీజేపీలు ఒక్కట‌య్యయాని, లోపాయికారి ఒప్పందంతోనే టీఆర్ ఎస్ ఓడింద‌న్నారు. అధికారం రావాల‌న్న దాహంతోనే బీజేపీ-కాంగ్రెస్ ఒక్క‌టై టీఆర్ ఎస్‌ను ఓడించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాయ‌న్నారు. ఎవ‌రెన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ పాల‌న‌పై ప్రజ‌ల‌కు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంద‌ని, మ‌రింత ఆద‌ర‌ణ పెరిగింద‌ని, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అధికారం మాదేనన్న భ్రమలో ఉన్నార‌న్నారు. ఢిల్లీలో కుస్తీ ప‌డుతున్నార‌ని, రాష్ట్రంలో దోస్తీ చేస్తున్నార‌ని, కాంగ్రెస్‌ను బీజేపీలో విలీనం చేస్తారా? స‌్పష్టం చేయాల‌న్నారు. బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ సంబ‌రాలు చేసుకొవ‌డ‌మేంట‌ని ఆయ‌న అన్నారు. ఎన్నిక‌ల మేనేజ్మేంట్ క‌మిటీ చైర్మన్‌గా ఉన్న దామోద‌ర్ కాంగ్రెస్ ఓట్లన్నీ బీజేపీ వేయించార‌ని ఆయ‌న ఆరోపించారు. కాంగ్రెస్ నాయ‌కులు ఇకనైనా క‌ళ్లు తేర‌వాల‌ని.. మీ నాయ‌కుని (దామోద‌ర్‌) మాటాలు న‌మ్మోద్దని, టీఆర్ ఎస్ పార్టీలో చేరండ‌ని, క‌లిసి క‌ట్టుగా అభివృద్ధి చేసుకుందామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భారీ మేజార్టీతో గెలుపు ఖాయం

స్థానిక సంస్థల శాస‌న‌మండలి ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి డాక్టర్ యాద‌వ‌రెడ్డి భారీ మేజార్టీతో గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న ధీమాను వ్యక్తం చేశారు. ఉమ్మడి మెద‌క్ జిల్లాలో మేజార్టీ స్థానాలు టీఆర్ ఎస్‌కు ఉన్నప్పటికీ, గెలువ‌లేమ‌ని తేలిసి కాంగ్రెస్ పోటీలో ఉండడం సిగ్గుచేట‌న్నారు. కేసీఆర్ చేప‌డుతున్న అభివృద్ది ప‌నుల‌కు ఆక‌ర్షితులై ఎంపీపీ, ఎంపీటీసీలు టీఆర్ఎస్‌లో చేరార‌న్నారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారన్నారు. ఈ ఫ‌లితాల‌ు ప్రతిపక్ష పార్టీకి చెంప‌పెట్టు లాంటిద‌వుతుంద‌న్నారు.

Next Story

Most Viewed