రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలకు బ్రెజిల్, చైనా పిలుపు

by Harish |
రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలకు బ్రెజిల్, చైనా పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా రష్యా మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రెండు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించడానికి శాంతి చర్చలకు పిలుపునిస్తూ బ్రెజిల్, చైనా ఒక సంయుక్త ప్రకటనపై సంతకం చేశాయి. బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ప్రత్యేక సలహాదారు సెల్సో అమోరిమ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సంతకం చేసిన ఈ పత్రంలో, "ఉక్రెయిన్ సంక్షోభానికి" చర్చలే సరైన పరిష్కారమని పేర్కొన్నారు. ఇరు పక్షాల సమాన భాగస్వామ్యంతో పాటు అన్ని శాంతి ప్రణాళికలపై న్యాయమైన చర్చతో రష్యా, ఉక్రెయిన్ రెండూ కూడా అంతర్జాతీయ శాంతి సమావేశానికి మద్దతు ఇస్తాయని పత్రంలో రాశారు.

సామూహిక విధ్వంసక ఆయుధాలు, ముఖ్యంగా అణ్వాయుధాలు లేదా రసాయన, జీవ ఆయుధాల వినియోగాన్ని తిరస్కరించాలి, బ్రెజిల్-చైనాలు "అణు వ్యాప్తిని నిరోధించడానికి, అణు సంక్షోభాన్ని నివారించడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలి" అని పత్రంలో జోడించారు. జూన్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. సమావేశానికి రావడానికి డజన్ల కొద్దీ ఇతర దేశాలు సంతకాలు చేశాయి. ఇక్కడే ఉక్రెయిన్‌లో శాంతి ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని స్విట్జర్లాండ్ భావిస్తుంది. బ్రెజిల్, చైనాతో సంబంధిత పక్షాలు యుద్ధ పరిస్థితిని తగ్గించడానికి మూడు సూత్రాలను పాటించాలని పిలుపునిచ్చాయి, అవి యుద్ధభూమిని విస్తరించకూడదు, పోరాటాన్ని పెంచకూడదు, ఏ పక్షాన్ని కూడా రెచ్చగొట్టకూడదు.

Next Story