రష్యాకు అనుకూలంగా ఉన్నందుకే స్లొవేకియా ప్రధానిపై కాల్పులు

by Harish |
రష్యాకు అనుకూలంగా ఉన్నందుకే స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
X

దిశ, నేషనల్ బ్యూరో : స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికో (59)పై మే 15న కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపింది. రాబర్ట్‌ ఫికోను హత్య చేయాలన్న ఉద్దేశం తనకు లేదని.. రష్యా అనుకూల ప్రభుత్వ విధానాలు నచ్చకపోవడంతో గాయపరిచేందుకు ఈ దాడి చేసినట్లు 71 ఏళ్ల నిందితుడు విచారణలో తెలిపాడు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు స్లొవేకియా సైనిక సాయం చేయాలన్నది తన ప్రధాన డిమాండ్‌ అని అతడు చెప్పడం గమనార్హం. ఈ మేరకు 9 పేజీల దర్యాప్తు నివేదికను అధికారులు ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. అతడిని వెంటనే నిర్బంధించాలని కోర్టు ఆదేశించింది. నిందితుడు గతంలో ఓ షాపింగ్ మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. అతడు 30 ఏళ్లుగా తుపాకీ వాడుతున్నాడు. తాను చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నట్లు, ప్రధానికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిందితుడు చెప్పాడు.

Next Story