ఆ కారణంతోనే ‘పుష్ప 2’ ఆఫర్ వదులుకున్నా : రవికృష్ణ

by Prasanna |
ఆ కారణంతోనే  ‘పుష్ప 2’ ఆఫర్ వదులుకున్నా : రవికృష్ణ
X

దిశ, సినిమా: గతేడాది సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీలో సీరియల్ నటుడు రవికృష్ణ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది, ఈ చిత్రంలో అతను మాంత్రికుడిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా తర్వాత అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన లవ్ మీ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. మే 25న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా రవికృష్ణ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

లవ్ మీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రవికృష్ణ మాట్లాడుతూ.. “నేను లవ్ మీ షూటింగ్ లో ఉండగానే పుష్ప 2లో నటించే అవకాశం వచ్చింది కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. ఇంత పెద్ద సినిమా మిస్ అయినప్పటికీ ఈ సినిమా నాకు మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ ' అని అన్నారు.

దీంతో రవికృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అతని వ్యాఖ్యలను స్పందించిన నెటిజన్లు “పుష్ప 2 వంటి పాన్-ఇండియా చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా గ్రేట్.. ఇంత మిడ్ రేంజ్ సినిమా కోసం పుష్ప 2 ఎలా వదులుకున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story