హిందువుల పై దాడిని ఐక్యత తో ఎదుర్కోవాలి : గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్

70

దిశ , గుడిహత్నూర్ : హిందువుల పై దాడిని ఐక్యత తో ఎదుర్కోవాలని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఆదివారం గుడిహత్నూర్ మండల కేంద్రం లో అజాది కా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకుని, కుమురం భీం బలిదాన్ దివస్ సందర్భంగా జిల్లా హిందూవాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ మహా సమ్మేళనంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం సైన్యంతో వీరోచితంగా పోరాటం చేసిన గోండు వీరుడు జల్ జంగల్ జమీన్ నినాదాన్ని విస్మరించి పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఆయన ఆశయాలు నెరవేర్చకుండా ఆదివాసీల హక్కులను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికి ఆదివాసీ అభివృద్ధికి నోచుకోలేదని విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా కేసీఆర్, ఎంఐఎం పార్టీ చేతిలో కీలుబోమ్మగా మారిందని ధ్వజమెత్తారు.

పార్టీలకతీతంగా హిందూ సమాజం కోసం, రామరాజ్య స్థాపన కోసం హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో మోడీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఆదివాసీ ఆరాధ్య దైవం కుమురం భీం జల్, జంగల్, జమీన్ కోసం పోరాడి బలిదానం ఇచ్చారని అయన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలనీ, అయన ఆశయన సాధన కోసం కృషి చేయాలని అన్నారు. హిందువుల జనాభ తగ్గించే కుట్రలు జరుగుతున్నాయని జాగ్రత్త పడకపోతే మన హిందువుల భవిష్యతు అంధకారమవుతుందని హెచ్చరించారు. సాధువులు పట్టిన గడ్డ మీద భగత్ సింగ్ లాంటి వీరులు పుట్టారని హిందు ధర్మ రక్షణ కోరకు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతిబిడ్డ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు హిందువాహిని వక్తలు మాట్లాడారు. హిందూ సమాజం పై జరుగుతున్నా దాడిని కేవలం మన ఐక్యత తోనే ఎదిరించగలం అన్నారు. కులాలకతీతంగా ఐక్యత గా ఉండాలని అన్నారు.

అంతకుముందు హిందువాహిని, బీజేపీ కార్యకర్తలు, ఆధ్వర్యంలో రాజాసింగ్ బైక్ ర్యాలీ నిర్వహించి గుడిహత్నూర్ బస్ స్టాండ్ లోని కొమురం భీం విగ్రహానికి , అంబెద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సభా స్థలానికి చేరుకొని గోమాత పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ వేదిక పైకి చేరుకున్న శాసన సభ్యులు రాజాసింగ్ గారికి శాలువాను కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్నవారు అప్పాల ప్రసాద్ సామాజిక సమరత వేదిక తెలంగాణ ప్రాంత కన్వీనర్, ధన్యరాధాకృష్ణ హిందువాహిని తెలంగాణ ప్రాంత మహిళ ప్రముఖ్ , కాజల్ హిందుస్థాని గుజరాత్ హిందు వాహిని నాయకురాలు, అర్యన్ మహరాజ్ హిందువాహిని అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మందుల విక్కి ఇందుర్ విభాగ్ సహ ప్రముఖ్ , కోడప నగేష్ తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శీ, స్థానిక ఎంపీపీ భరత్ నాగర్ గోజే, జడ్పీటీసీ పతాంగే బ్రహ్మానంధ్ పలువురు హిందూ వాహిని. నాయకులు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..