భూముల రిజిస్ట్రేషన్లపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

by  |
sachivalayam
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ/ వార్డు సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తొలి దశలో రాష్ట్రంలోని 51 గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలివిడతలో భాగంగా ఎంపికైన గ్రామ సచివాలయాల్లోని సిబ్బందికి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఆ తర్వాత విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అందరికీ శిక్షణ ఇచ్చి భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Next Story

Most Viewed