బెజవాడ దుర్గగుడిలో అమ్మవారి చీరలు గల్లంతు

by  |
Bejawada Durgamma Gudi
X

దిశ, ఏపీబ్యూరో: బెజవాడ దుర్గగుడిలో నాలుగు రోజుల నుంచి తనిఖీలు చేస్తోన్న ఏసీబీ సోమవారం నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికలో శానిటేషన్ ​టెండర్లు, మ్యాక్స్​సంస్థకు సెక్యూరిటీ టెండర్లలో నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు కారణం ఈవో ఈఓ సురేష్ బాబేనని నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. భక్తులు అమ్మవారికి ఇచ్చిన చీరలు గల్లంతైనట్టు గుర్తించారు. ప్రసాదాల స్టోర్స్‌లో లెక్కలు తేలనట్టు నివేదికలో ఏసీబీ తెలిపింది. ఓవైపు ఏసీబీ అధికారులు సమగ్ర నివేదికను సమర్పించగా ఆదివారం ఈవో సురేష్​విశాఖ శారదా పీఠాధిపతి సన్నిధిలో ప్రత్యక్షం కావడం విశేషం.



Next Story