ఆ మహాభారతానికి ఇంకో పేరు.. జయ

by  |
ఆ మహాభారతానికి ఇంకో పేరు.. జయ
X

దిశ, సినిమా : నేషనల్ అవార్డ్ విన్నర్ కంగనా రనౌత్.. ‘తలైవి’ ద్వారా మరోసారి తన నట విశ్వనరూపాన్ని చూపించింది. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అమ్మ(జయ) పాత్రలో ఒదిగిపోయిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఫస్ట్ లుక్ బయటకు వచ్చినప్పుడు కంగనను విమర్శించిన వారే ఇప్పుడు ట్రైలర్ చూసి ప్రశంసల వర్షం కురిపిస్తుండటం ఆమె ప్రతిభకు దక్కిన గౌరవమే. ఇక కంగన పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ట్రైలర్.. జయలలిత సినీ జీవితాన్ని పరిచయం చేస్తూ ప్రారంభం కాగా, ఆ తర్వాత ఎంజీఆర్‌తో పరిచయం.. తన ఒత్తిడితో రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఆ తర్వాత ఎదుర్కొన్న అవమానాలు.. అవహేళనలను పునాదిగా చేసుకుని తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు.

కంగన ఎప్పటిలాగే తన పాత్రకు వంద శాతం న్యాయం చేయగా.. జయలలిత నటిగా, రాజకీయ నాయకురాలిగా ఉన్నప్పటి వ్యత్యాసాన్ని స్క్రీన్‌పై హండ్రెడ్ పర్సెంట్ చూపించింది. యాక్టర్‌గా చిలిపితనం.. పొలిటీషియన్‌గా హుందాతనంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా అసెంబ్లీ నుంచి జయమ్మను బయటకు వెళ్లగొట్టినపుడు ‘ఆ మహాభారతానికి ఇంకో పేరుంది.. జయ’ అంటూ శపథం చేసే సన్నివేశంలో కంగన యాక్టింగ్‌కు ఫిదా అయిన ప్రేక్షకులు.. అమ్మ పాత్రను పోషించేందుకు కంగనానే బెస్ట్ చాయిస్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

మరో అవార్డ్ విన్నింగ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చేసిందని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కేవీ విజయేంద్రప్రసాద్ కథ అందించగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి మెప్పించారు. విజువల్లీ గ్రాండ్.. కంటెంట్ డీటెయిల్డ్‌గా ఉన్న ట్రైలర్‌కు జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ మరింత ప్లస్ అయిందనడంలో సందేహం లేదు. కాగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కిన ‘తలైవి’ ఏప్రిల్ 23న రిలీజ్ కానుంది.

Next Story

Most Viewed