కరోనా పై తెలుగు ఇండస్ట్రీ సాంగ్

by  |
కరోనా పై తెలుగు ఇండస్ట్రీ సాంగ్
X

తెలుగు సినిమా ఇండస్ట్రీ కష్ట కాలంలో ఆదుకుంటుంది. ఏ విపత్తు వచ్చినా వెనుకడుగు వేయకుండా… మేమున్నాం అంటూ భరోసా ఇస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే… అవలీలగా ఎదుర్కొందాం అనే ధైర్యాన్ని ఇస్తుంది. డబ్బు గురించి వెనుకాడకుండా ముందుకు సాగుతూనే… కరోనా వైరస్ విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుపుతూ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. కోటి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన సాంగ్ లో మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లు ప్రజలకు సూచనలు ఇచ్చారు. అంతే కాదు లాక్ డౌన్ ఉండడంతో ఎవరి ఇంట్లో వాళ్ళే ఈ వీడియో షూట్ చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వర్క్ ఫ్రమ్ హోం చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ ఆధ్వర్యంలో రిలీజ్ అయిన సాంగ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల బాగుకోసం హీరోలు పడుతున్న తపనకు సలాం కొడుతున్నారు.

అయితే ఈ సాంగ్ పాడుతూ మీరు ఇంట్లోనే ఫోన్ లో రికార్డ్ చేసి పంపించవచ్చని తెలిపారు చిరు. మీరు సెండ్ చేసిన వీడియోను ఎడిట్ చేసి సాంగ్ లో యాడ్ చేస్తామన్నారు.

ఈ సాంగ్ పై స్పందిస్తూ… సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. కరోనా వైరస్ పై వచ్చిన మెగా ఎమోషనల్ సాంగ్ ఫెంటాస్టిక్ గా ఉందన్నారు. బ్యాక్టీరియా ఇంటెలిజెంట్ సోర్స్ ప్రకారం కరోనా వైరస్ కు కూడా పాట బాగా నచ్చిందని తెలుస్తోందన్నారు. ఏప్రిల్ ఫూల్ డే కు నా నుంచి కరోనా వైరస్ పై సాంగ్ రిలీజ్ అవుతుందని వెల్లడించారు. అప్పుడు వైరస్ డిసైడ్ అవుతది ఎవరూ ఫూల్ అని ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed