టీఆర్ఎస్‌లో టెన్షన్.. హాట్ టాపిక్‌గా కౌశిక్ రెడ్డి స్పెషల్ ఆపరేషన్

by  |
టీఆర్ఎస్‌లో టెన్షన్.. హాట్ టాపిక్‌గా కౌశిక్ రెడ్డి స్పెషల్ ఆపరేషన్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి సింగిల్ ఆపరేషన్స్ మొదలు పెట్టారు. ఉప ఎన్నికల వేళ ఆయన గ్రామాల్లో తిరుగుతూ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తుండటం విశేషం. మూడు రోజుల క్రితం మంత్రి హరీష్ రావు వీణవంక మండలంలో పర్యటించిన తర్వాత నుంచి కౌశిక్ రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

అందరితో కలిసి ముచ్చటిస్తూ పార్టీ గురించి ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, కౌశిక్ సింగిల్ మెన్ ఆపరేషన్ స్టార్ట్ చేయడమే ఇక్కడ చర్చనీయాశంగా మారింది. ఇదే మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో పాటు మండల పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా గ్రామాల్లో తిరుగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.

వ్యూహం మర్చారా..?

టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డి కొంతకాలం నియోజకవర్గంతో అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. ప్రముఖుల పర్యటన ఉన్నప్పుడు మాత్రమే కనిపించారు. కానీ, మూడు రోజుల క్రితం మంత్రి హరీష్ రావు వీణవంక మండలంలో సమావేశం ఏర్పాటు చేసినప్పటి నుండి కౌశిక్ మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ స్పెషల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు.

అధిష్టానం సూచన మేరకే కౌశిక్ ఇలా వ్యవహరిస్తున్నారా లేక సొంత ఎజెండాతోనే టూర్లు చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాలన్న లక్ష్యంతో పావులు కదుతుపుతుంటే.. కౌశిక్ రెడ్డి మాత్రం పార్టీ లీడర్స్‌కు కేడర్‌కు సంబంధం లేకుండా స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం గమనార్హం.

మింగిల్ కాలేకపోతున్నారా..?

TRS పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి స్థానిక టీఆర్ఎస్ నాయకులతో మింగిల్ కాలేకపోతున్నారా.? లేక లీడర్లు ఆయనతో టచ్‌లో ఉండటం లేదోనన్న చర్చ కూడా సాగుతోంది. ఎమ్మెల్సీ పదవి అధికారికంగా ప్రకటించే ప్రక్రియ అర్థాంతరంగా ఆగిపోవడంతో కౌశిక్ రెడ్డి తన లక్ష్యం మార్చుకుని ఉంటారా? అన్న విషయంపై కూడా తర్జనభర్జనలు సాగుతున్నాయి.

ఫీడ్ బ్యాక్ కోసమా.?

గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది, ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు ఏంటీ అన్న ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకే కౌశిక్ రెడ్డి స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారా అన్న కోణంలోనూ డిస్కషన్ జరుగుతోంది. ఉన్నట్టుండి కౌశిక్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తుండటమే ఇప్పుడు అక్కడ ప్రధాన చర్చకు దారి తీసిందన్నది మాత్రం వాస్తవం.

ఇవి కూడా చదవండి:

రేవంత్ vs మల్లారెడ్డి.. అగ్గిరాజేసిన ఏడేళ్ల పగ

ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నారా.. ఇలా చేస్తే లక్షల్లో సంపాదన మీ సొంతం



Next Story

Most Viewed