శ్రీవారి మెట్టు మార్గం తాత్కాలికంగా మూసివేత

76

దిశ, ఏపీ బ్యూరో: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు నడక మార్గంలో బండరాళ్లు పడుతుండడంతో తాత్కాలికంగా మూసివేశారు. ఎప్పటినుంచి భక్తులను అనుమతిస్తారనేది తిరిగి తెలియజేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. నడకదారి భక్తులు ఈ విషయాన్ని గమనించి తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.