సింగరేణిలో ప్రమాదాలు వారిద్దరి వల్లే జరుగుతున్నాయి: వైవి రావు

by Disha Web Desk 19 |
సింగరేణిలో ప్రమాదాలు వారిద్దరి వల్లే జరుగుతున్నాయి: వైవి రావు
X

దిశ, గోదావరిఖని: సింగరేణి సీఎండీకి చలనం లేదని ఏఐటీయూసీ నాయకులు వైవి రావు ఆరోపించారు. గత మూడు రోజులుగా ఏఎల్‌పీ గనిలో మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్‌కు న్యాయం చేయాలని సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరిపితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. సింగరేణిలో ప్రమాదాలు సీఎండీ, డైరెక్టర్ వల్లే జరుగుతున్నాయని విమర్శించారు. అంతే కాకుండా సింగరేణి యాజమాన్యం శవ రాజకీయాలు చేస్తుందని అన్నారు. వెంటనే యాజమాన్యం స్పందించకపోతే శ్రీకాంత్ మృతదేహంతో ఏఎల్‌పీ గని ముందు కార్మికులతో కలసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించకపోతే తర్వాత జరిగే పరిణామాలకు యాజమాన్యానిదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు. సింగరేణి అధికారులు చర్చలకు దిగి రాకపోతే రామగుండం రీజియన్‌లో కార్మికుల మద్దతు తీసుకొని బొగ్గు‌ను బంద్ చేస్తామని తెలిపారు.



Next Story

Most Viewed