- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండుముక్కలైన మహిళ
దిశ, కొండపాక : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, కొండపాక : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని కుకునూరుపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద బైక్‌ను లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. జగదేవపూర్ మండలం గణేష్ పల్లి గ్రామానికి చెందిన గడియరం పద్మ తన కుమారుడితో కలిసి బైక్‌పై సోమవారం ఉదయం సిద్దిపేట నుండి గణేష్ పల్లి కి వెళుతుంది. ఈ క్రమంలో కుకునూర్ పల్లి ఇండియన్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే సిద్దిపేట నుంచి వస్తున్న లారీ స్పీడ్ కంట్రోల్ తప్పి ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న మహిళ లారీ టైర్ కింద పడి రెండు ముక్కలై అక్కడికక్కడే మృతి చెందగా, కొడుకు సందీప్‌కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాల తెలియాల్సిఉంది.






