2030 నాటికి రూ. 7.6లక్షల కోట్లకు భారత వస్త్ర ఎగుమతులు..!

by Disha Web Desk 19 |
2030 నాటికి రూ. 7.6లక్షల కోట్లకు భారత వస్త్ర ఎగుమతులు..!
X

న్యూఢిల్లీ: 2030 నాటికి దేశంలోని వస్త్ర ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల(రూ. 7.6 లక్షల కోట్ల)కు చేర్చాలని కేంద్ర టెక్స్‌టైల్ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఓ కార్యక్రమంలో పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. ఇటీవలే యూఏఈ, ఆస్ట్రేలియాలతో ఈ రంగానికి జీరో డ్యూటీ యాక్సెస్ లభించిందని, దీనివల్ల పరిశ్రమ ఎగుమతులు ఊపందుకుంటాయని తెలిపారు. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సి్‌లో ఉన్న సభ్య దేశాలతో జీరో డ్యూటీ యాక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నామని, ఆయా దేశాలతో భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో వస్త్ర ఎగుమతులు దాదాపు రూ. 3.27 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత కొంతాకలంగా ఈ రంగం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే 2030 నాటికి రెట్టింపు స్థాయిలో రూ. 7.6 లక్షల కోట్ల ఎగుమతులు అందుకుంటాం. వృద్ధిని పెంచేందుకు, గణనీయమైన లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా భౌగోళిక-రాజకీయ పరిస్థితులు మారుతున్నాయని, ఎగుమతులను పెంచేందుకు పరిశ్రమకు భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.


Next Story

Most Viewed